న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నకిలీ ఆస్కార్‌ను అభిమానులకు చూపిస్తోన్న కోహ్లీ (వీడియో)

Virat Kohli stuns fans with Oscar moment. See it here!

న్యూ ఢిల్లీ: ఏ విషయమైనా ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకోవడం విరాట్‌ కోహ్లీకి అలవాటు. ఒక్కోసారి ఆటపట్టించేలా కూడా పోస్టులు చేస్తుంటాడు. ఇలాగే తాను ఓ సినిమాలో నటిస్తున్నట్లు గత నెలలో కోహ్లీ ట్విటర్‌లో ఓ పోస్టు చేశాడు. దాని పేరు ట్రైలర్‌ అని, నిర్మాత వ్రాన్‌ ప్రొడక్షన్స్‌ అని.. తన స్టిల్‌ ఉన్న ఓ పోస్టర్‌ను గత నెల 20న ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన అభిమానులంతా అవాక్కయ్యారు.

నిజంగా సినిమాలో నటిస్తున్నాడా అని

కొహ్లీ నిజంగా సినిమాలో నటిస్తున్నాడా అని ఆశ్చర్యపోయారు. అయితే ‘ఈ ఫేక్‌ సినిమాకు ఇప్పుడు నకిలీ ఆస్కార్‌ గెలిచా'నని ఆటపట్టిస్తూ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.‘నేను నటించని ట్రైలర్‌ సినిమాకు వచ్చిన నకిలీ ఆస్కార్‌ ఇది. ఈ సినిమాను నిర్మించని వ్రాన్‌ ప్రొడక్షన్‌కూ, దాన్ని చూడని ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఓ ఫేక్‌ చిత్రం కాబట్టి.. ఇదీ నకిలీ ఆస్కార్‌' అని 22 సెకన్ల వీడియోను పోస్ట్‌ చేశాడు.

వెస్టిండీస్‌తో మ్యాచ్‌‌లలో కోహ్లీ

వెస్టిండీస్‌తో మ్యాచ్‌‌లలో కోహ్లీ

ఆసియా కప్‌ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ వెస్టిండీస్‌తో టెస్ట్‌ మ్యాచ్‌‌లో ఆడాడు. జట్టును విజయంపథంలో నడిపించి.. ఆ జట్టుతోనే ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు.

లైఫ్ స్టైల్‌కు కూడా అభిమానులెక్కువ

లైఫ్ స్టైల్‌కు కూడా అభిమానులెక్కువ

టీమిండియా కెప్టెన్‌గా.. భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన కోహ్లీ.. టాప్ రేటెడ్ బ్యాట్స్‌మెన్‌గానూ సచిన్ టెండుల్కర్ రికార్డులను బ్రేక్ చేయగలిగిన సత్తా గల యువ క్రికెటర్‌గా కోహ్లీ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఆటతీరుతో పాటు అతని లైఫ్ స్టైల్‌కు కూడా అభిమానులు ఎక్కువ. అయితే ఓ కొత్త ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నానంటూ ట్విట్టర్ వేదికగా కొన్నిరోజుల క్రితమే ప్రకటన చేశాడు.

'ట్రైలర్ ది మూవీ' పేరుతో ఓ పోస్టర్

'ట్రైలర్ ది మూవీ' పేరుతో ఓ పోస్టర్

'ట్రైలర్ ది మూవీ' పేరుతో ఓ పోస్టర్ కూడా విడుదల చేశాడు. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కొహ్లీ పెట్టిన పోస్ట్‌తో అభిమానుల అంచనాలు పెరిగిపోయాయి. విరాట్ సతీమణి అనుష్క శర్మతో కలిసి సినిమా తీస్తున్నాడంటూ కొందరు.. బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటూ మరికొందరు..ఊహాగానాలు వినిపించాయి.

Story first published: Thursday, October 18, 2018, 18:34 [IST]
Other articles published on Oct 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X