INDvsAUS : వన్డే సిరీస్‌లో ఫెయిల్.. కోహ్లీ బలమే బలహీనతగా మారిందా?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీసులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. తనకు బాగా వచ్చిన ఫ్లిక్ షాట్ ఆడుతూనే రెండు వన్డేల్లో అతను అవుటయ్యాడు. ముఖ్యంగా రెండో వన్డేలో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతుండగా.. కోహ్లీ మాత్రం క్రీజులో పాతుకుపోయినట్లే కనిపించాడు. స్టార్క్, గ్రీన్ వేసిన ప్రమాదకరమైన స్పెల్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో అతను కచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అలా జరగలేదు.
నాథన్ ఎల్లీస్ వేసిన తొలి బంతికే ఫ్లిక్ షాట్ ఆడబోయిన కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. తొలి వన్డేలో కూడా ఇదే షాట్ ఆడబోయిన కోహ్లీ పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించాడు. కోహ్లీ అవుటైన డెలివరీ చాలా గొప్ప బాల్ అని కితాబిచ్చాడు. కోహ్లీ ఇలా ఫ్లిక్ షాట్ ఆడుతూ అవుటవడం సాధారణంగా కనిపించదని, ఆ షాట్ అతనికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకొచ్చాడు. 'కోహ్లీ ఇలా అవుటవడం మనకు సాధారణంగా కనిపించదు. కానీ అతను రెండు మ్యాచుల్లో ఇలాగే అవుటయ్యాడు' అని గుర్తుచేశాడు.
'రెండో వన్డేలో కోహ్లీ చక్కగా బ్యాటింగ్ చేశాడు. స్టార్క్, గ్రీన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అలాంటిది నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో అతను ఇలా అవుటవడం దురదృష్టకరం. ఇలా ఒకే రకంగా కోహ్లీ అవుటవడం ప్రతిసారీ జరగదు. కానీ ఒక్కోసారి టైం కలిసిరాదు. మన బలమే బలహీనతగా మారుతుంది' అని రాజ్‌కుమార్ శర్మ చెప్పాడు. అలాగే ఈ వన్డే సిరీస్ నెగ్గడం భారత్‌కు చాలా ముఖ్యమన్నాడు. ఈ సిరీస్ నెగ్గిన జట్టు వన్డే వరల్డ్ కప్‌లో మానసికంగా పైచేయి సాధిస్తుందని వివరించాడు. అలాగే భారత టాపార్డర్ తమ ఆటతీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. స్టార్క్‌ను ఎలా ఎదుర్కోవాలో టీమిండియా ఒక ప్లాన్ వేసుకోవడం ముఖ్యమని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications