న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో ఉండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన చిన్ననాటి ఫొటో ఒకటి ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోలో తాను ఎక్కడున్నది కనుక్కోవాలంటూ అభిమానులకు పరీక్ష పెట్టాడు.

కోహ్లీ పోస్టు చేసిన ఈ ఫొటోలో కోహ్లీ ఎర్ర టోపీ ధరించి, ఎర్ర బంతి చేతపట్టుకుని తోటి క్రీడాకారులతో కలిసి క్రికెట్ స్టేడియంలోకి వస్తున్నాడు. తాజాగా కోహ్లీ తన చిన్నప్పటి ఫొటో ఒకటిని ట్విట్టర్ లో పోస్టు చేసి 'గడిచిపోయిన రోజులు ఎంతో మధురం' అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో కోహ్లీ అభిమానుల అంచనా మేరకు రాణించడం లేదు. మూడు టీ20ల సిరిస్‌ను 1-1తో ఇరు జట్లు సమం చేశాయి. ఈ సిరిస్‌లో చివరిదైన చివరిదైన మూడో టీ20 ఫిబ్రవరి 1న బెంగళూరులో జరగనుంది.