Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనికి కోహ్లీ మద్దతు: అసలు కారణం వెల్లడించిన గంగూలీ

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ ధోని అవసరం ఉందని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కీపర్‌గానే కాకుండా, కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ధోని జట్టులో కొనసాగడానికి కారణం అవుతుందని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ధోని సలహాలు కోహ్లీకి ఎంతగానో

ధోని సలహాలు కోహ్లీకి ఎంతగానో

మ్యాచ్‌లు జరిగే సమయంలో కొన్ని కీలకమైన పరిస్థితుల్లో ధోని సలహాలు కోహ్లీకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, అందుచేతనే కోహ్లీ కూడా ధోనికి మద్దతుగా నిలుస్తున్నాడని గంగూలీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న 2019 వన్డే వరల్డ్ కప్ వరకూ ధోని జట్టులో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దాదా చెప్పాడు.

ధోని సలహాలు జట్టు విజయంలో ముఖ్య భూమిక

ధోని సలహాలు జట్టు విజయంలో ముఖ్య భూమిక

'2019లో జరిగే వరల్డ్ కప్ వరకూ ధోని జట్టుతో పాటు ఉంటాడని అనుకుంటున్నా. ధోని నాయకత్వ లక్షణాలే అతన్ని ఇంకా జట్టులో కొనసాగేలా చేస్తున్నాయి. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన తరువాత కూడా ధోని సలహాలు జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఈ విషయం కోహ్లీ కూడా తెలుసు' అని గంగూలీ అన్నాడు.

ధోని విలువ ఏమిటో కోహ్లీకి బాగా తెలుసు

ధోని విలువ ఏమిటో కోహ్లీకి బాగా తెలుసు

'36 ఏళ్ల వయసులో కూడా ధోని జట్టులో ఉన్నాడంటే అతని విలువ ఏమిటో కోహ్లీకి బాగా తెలుసు. అందుకే ధోనికి కోహ్లీ మద్దతుగా నిలుస్తున్నాడు. 2004లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చూసిన ధోనికి ఇప్పటి ధోనికి తేడా ఉండొచ్చు. వయసు పెరిగే కొద్ది ఎవరి గేమ్ అయినా మారుతూ ఉంటుంది' అని గంగూలీ పేర్కొన్నాడు.

వయసుతో పాటే ఆట కూడా మారుతుంది

వయసుతో పాటే ఆట కూడా మారుతుంది

'క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆట కూడా వయసుతోపాటే మారుతూ వచ్చింది. అలానే ఇప్పుడు ధోని ఆట కూడా ఇప్పుడు మారింది. కానీ వికెట్ల వెనకే ఉండి వ్యూహాల్ని రచించడంలో ధోని దిట్ట. ధోని ఫిట్‌గా ఉంటే మాత్రం వచ్చే వరల్డ్‌కప్‌లో ఆడటం ఖాయం. ఎందుకంటే కెప్టెన్ అండగా నిలుస్తాడని ధోనికి తెలుసు' అని గంగూలీ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+