Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక గ్లాసు మద్యం తీసుకున్నాక చెప్తున్నా విరాట్,స్మిత్ ఇద్దరూ ఫ్రీక్‌లే: మైకెల్ వాగన్

Virat Kohli and Steven Smith are Freaks, Says Michael Vaughan

హైదరాబాద్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరసన స్టీవ్ స్మిత్ చేరాడట. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతంగా ద్విశతకం బాదిన నేపథ్యంలో ఉద్వేగానికి గురైన వాగన్ ఈ మాటలన్నాడు.

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు ఓపెనర్లు కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌ (25), డేవిడ్‌ వార్నర్‌ (22) తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌ చక్కగా ఆడాడు. అతని ఆటకు ముగ్ధుడైన మైకెల్ వాగన్ 'ఓ గ్లాస్‌ మద్యం పుచ్చుకున్న తర్వాత నిర్ణయించుకున్నా. స్టీవ్‌ స్మిత్‌ ఫ్రీక్‌ విభాగంలో విరాట్‌ కోహ్లీ సరసన చేరాడు. అద్భుతమైన ఆటగాడు'అంటూ ట్వీట్‌ చేశాడు.

అగ్రశ్రేణి జట్లైన భారత్‌, ఆస్ట్రేలియా సారథులు విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌ టెస్టు క్రికెట్‌లో పోటీపడి మరీ ఆడుతున్నారు. జట్లను ఓటముల భారీ నుంచి కాపాడుతున్నారు. మైదానంలో ప్రదర్శించే ఆటతీరు, నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో దూకుడు ఇటువంటి లక్షణాలతో జట్టును నడిపించడంలో వీరిద్దరూ ఒకేలా ఉన్నారని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్‌ ద్విశతకం బాదేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ఇది అతని 22వ టెస్టు శతకం. కెరీర్‌లో 58 టెస్టులాడిన స్మిత్‌ 60.40 సగటుతో 5,557 పరుగులు చేశాడు. ఇక 63 టెస్టులాడిన కోహ్లీ 53.75 సగటుతో 5,268 పరుగులు చేశాడు. 20 శతకాలు సాధించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 16, 2017, 17:34 [IST]
Other articles published on Dec 16, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+