కింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు.. ఇక ఆసియాకప్ టోర్నీలో అసలు సిసలు కోహ్లీని చూడడం ఖాయం

ఆగస్టు 27న ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టోర్నీ కోసం భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ప్రాక్టీస్ షురూ చేశాడు. గురువారం మైదానంలో అతను ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. ఇండోర్ ప్రాక్టీస్ సెంటర్లో వికెట్ల మధ్య చిన్న స్ప్రింట్లు చేస్తూ కనిపించాడు. జూలై - ఆగస్టులో వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు భారత జట్టులో కోహ్లీ ఆడలేదు. అతనికి సెలెక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.
అతను జింబాబ్వే పర్యటనకు కూడా వెళ్లడం లేదు. ఆగస్టు 27న ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టోర్నీ కోసం భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ప్రాక్టీస్ షురూ చేశాడు. గురువారం మైదానంలో అతను ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. ఇండోర్ ప్రాక్టీస్ సెంటర్లో వికెట్ల మధ్య చిన్న స్ప్రింట్లు చేస్తూ కనిపించాడు. జూలై - ఆగస్టులో వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు భారత జట్టులో కోహ్లీ ఆడలేదు. అతనికి సెలెక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. అతను జింబాబ్వే పర్యటనకు కూడా వెళ్లడం లేదు.

ఎన్ని విమర్శలొచ్చినా విరాట్‌పైనే నమ్మకం
భారత టీ20 జట్టులో కోహ్లీ స్థానంపై ఇటీవల అనేక రూమర్లు వచ్చాయి. అతను పేలవ ఫాంలో ఉన్నాడని అతన్ని జట్టు నుంచి తప్పించాలని ఓ వర్గం క్రికెట్ ప్రముఖులు సూచనలు కూడా చేశారు. అయితే బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మాత్రం అతనిపై నమ్మకముంచింది. ఆసియా కప్ టోర్నీ కోసం ఎంపిక చేసిన 15మంది సభ్యుల జట్టులో అతన్ని తీసుకుంది. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ ఈ సిరీస్‌కు స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. అక్టోబరు-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20ప్రపంచకప్ గెలవడమే తన కల అని కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఆసియాకప్, ప్రపంచకప్ గెలిపించడమే నా లక్ష్యం
'ఆసియా కప్, ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌ను గెలిపించడమే నా ప్రధాన లక్ష్యం. దాని కోసం నేను జట్టు కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం' అని కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగింది. అతను రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్‌లో కేవలం 31పరుగులు మాత్రమే చేశాడు. అలాగే T20లు, ODIలలో 4మ్యాచ్‌లలో కలిపి 46పరుగులు మాత్రమే చేశాడు.
కోహ్లీ ఇంకెంతో దూరంలో లేడు
ఆసియాకప్ టోర్నీలో ఎలాగైన కోహ్లీ తన మునుపటి ఫామ్‌ను కనుగొనాలని మాజీ ఆటగాళ్లు, క్రికెట్ నిపుణులు మద్దతు ఇస్తున్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే బుధవారం మాట్లాడుతూ.. కోహ్లీ తన లీన్ ప్యాచ్‌ను ముగించడానికి ఎంతో దూరం లేడని, యుఏఈలో భారత్ తరఫున చెలరేగడానికి కోహ్లీ దగ్గర అన్ని అస్ట్రశస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 'ప్రస్తుతం విరాట్ ఎదుర్కొంటున్న పేలవ ఫామ్ దురదృష్టకరం. కానీ అతను మేటి ఆటగాడు. విరాట్ తన మునుపటి ఫామ్ అందుకునేందుకు కావాల్సిన సామర్థ్యాలున్నాయి. నేను అతన్ని నమ్ముతున్నాను. ఆసియా కప్ ద్వారా కోహ్లీ కచ్చితంగా ఫామ్ అందుకుంటాడని అనుకుంటున్నాను' అని జయవర్ధనే తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications