సఫారీలపై ఏ కెప్టెన్‌కు సాధ్యం కాని రికార్డు కోహ్లీ సొంతం!

హైదరాబాద్: భారత్‌లో టెస్టు సిరిస్ నెగ్గాలని ఎంతో మంది విదేశీ కెప్టెన్లకు కలగా ఉంటుంది. అయితే, ఆ కల కలగానే మిగిలిపోయింది పలువురు పర్యాటక జట్ల కెప్టెన్లకు. తాజాగా, ఈ కోవలోకే సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ కూడా చేరాడు. మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది.
టీ20 సిరిస్‌ను 2-0తో చేజార్చుకున్న సఫారీలు... టెస్టు సిరిస్‌లో క్లీన్ స్వీప్‌కు గురయ్యారు. ముఖ్యంగా రాంచీ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో అతిపెద్ద ఓటమి.
ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక టెస్టు మ్యాచ్‌లు నెగ్గిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాపై మొత్తం 10 టెస్టులాడి 7 టెస్టుల్లో విజయం సాధించింది.

3-0తో సిరిస్ క్లీన్ స్వీప్
మరోవైపు ఇతర కెప్టెన్ల నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై మొత్తం 29 టెస్టులాడగా కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగలిగింది. 2015లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో చేజార్చుకుంది. ఆ తర్వాత 2018లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనకు వెళ్లింది.

కోహ్లీ అరుదైన రికార్డు
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 2-1తో టెస్టు సిరిస్‌ను కోల్పోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై 3-0తో టెస్టు సిరిస్‌ను గెలిచింది. ఫలితంగా సఫారీలను క్లీన్‌స్వీప్ చేసిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా జట్టుపై కెప్టెన్‌గా కోహ్లీకి ఇదే తొలి వైట్‌వాష్ సిరిస్.

అజహర్ రికార్డు సమం
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజహరుద్దీన్ రికార్డుని అధిగమించాడు. టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక వైట్‌వాష్‌లు(మూడు టెస్టులు లేదా అంతకమించి) చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా రెండు సిరిస్‌లను వైట్ వాష్ చేయగా... కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు సార్లు ప్రత్యర్ధి జట్లను వైట్‌వాష్ చేసింది.

ధోని నాయకత్వంలో ఒకే ఒక్కసారి
1993లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై అజహర్ నాయకత్వంలోని టీమిండియా 3-0తో టెస్టు సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత 1994లో శ్రీలంకపై(3-0)తో టెస్టు సిరిస్‌ను టీమిండియా నెగ్గింది. ఆ తర్వాత ధోని నాయకత్వంలోని టీమిండియా కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 2013లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుపై ధోని నాయకత్వంలోని టీమిండియా 4-0తో టెస్టు సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications