బంగ్లాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆ రెండు రికార్డులు బద్దలు కొట్టేనా?

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం రెండు రికార్డులు ఎదురు చూస్తున్నాయి. గత ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 66(7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీకి ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తద్వారా ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్‌లో వరుసగా ఐదు సెంచరీలు బాదిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ గత నాలుగు మ్యాచుల్లో వెస్టిండీస్ (72), అఫ్గానిస్థాన్ (67), పాకిస్థాన్ (77), పాకిస్థాన్‌పై (82) హాఫ్ సెంచరీలు సాధించాడు. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(18) పరుగులు చేశాడు.
ఇలా, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 382 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గనుక హాఫ్ సెంచరీ సాధిస్తే వన్డేల్లో వరుసగా ఆరు సెంచరీలు నమోదు చేసిన ఎనిమిదో బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు సాధిస్తాడు.

పాకిస్థాన్‌కు చెందిన జావేద్ మియాందాద్
పాకిస్థాన్‌కు చెందిన జావేద్ మియాందాద్(9 హాఫ్ సెంచరీల)తో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 1987లో జావేద్ మియాందాద్ ఈ రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు ప్రపంచకప్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న మూడో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్(2278), సౌరవ్ గంగూలీ(1006) సరసన నిలుస్తాడు.

36 పరుగులు చేస్తే
ఈ మైలురాయిని అందుకోవడానికి కోహ్లీ 36 పరుగులు చేస్తే సరి. ఇక, ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు సాధించడానికి కోహ్లీ కేవలం 7 పరుగుల దూరంలో ఉన్నాడు. అదే గనుక జరిగితే ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలుస్తాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆరోన్ ఫించ్(1138), ఉస్మాన్ ఖవాజా(1067) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు ఏడో సారి
తద్వారా విరాట్ కోహ్లీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు ఏడో సారి సాధించినట్లు అవుతుది. దీంతో ఒక క్యాలెంటర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించిన మాజీ క్రికెట్ దిగ్గజాలైన సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్‌ల రికార్డుని కోహ్లీ అధిగమిస్తాడు. వీరిద్దరూ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులను ఆరు సార్లు సాధించారు.

రెండు సార్లు వరుసగా నాలుగు ఏళ్ల పాటు
కాగా, విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019లలో 1000 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్(ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు - 7 సార్లు) రికార్డుని విరాట్ కోహ్లీ సమం చేశాడు. ఈ ఏడాది కోహ్లీ 1000 పరుగుల మైలురాయిని అందుకోవడంతో రెండు సార్లు వరుసగా నాలుగు ఏళ్లు ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

1997-2000లో వరుసగా నాలుగు సార్లు
1997-2000లో వరుసగా నాలుగు సార్లు సౌరవ్ గంగూలీ 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే, సౌరవ్ గంగూలీ ఒక్కసారి ఈ ఘనత సాధించగా... 14 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. అంతేకాదు 30 ఏళ్ల లోపే కోహ్లీ రెండు సార్లు ఈ ఘనత సాధించాడు. గత ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ (1238) పేరిట ఉన్న రికార్డునూ కూడా కోహ్లీ అధిగమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications