కోహ్లీ వాలెట్ ఖరీదు 80 వేలు, టాప్ 5 అంబాసిడర్లలో కోహ్లీ


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ అన్ని నంబర్ వన్‌గా ఉండాలనుకుంటాడు. అతని ఆటతీరే కాదు.. వాడే వస్తువులను కూడా అదే స్థాయిలో ఉండాలని ఆశపడుతుంటాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం విరామంలో ఉన్న కోహ్లీ తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. అదీ అతని చేతిలోని వాలెట్ ద్వారా. కేవలం దాని ఖరీదే రూ.80వేలు ఉంటుందని అంచనా.
ఎన్నో కంపెనీలకు అంబాసిడర్‌గా ఉన్న కోహ్లీ వాలెట్‌కు రూ.80 వేలు ఖర్చు పెట్టడం పెద్ద లెక్కేం కాదు. ప్రపంచంలోని బడాబాబులు వాడే స్థాయి వాలెట్‌ను కోహ్లీ వాడుతున్నాడు. నల్లరంగులోని లూయిస్ విటాన్ జిప్పీ ఎక్స్‌ఎల్ వ్యాలెట్‌ను కోహ్లీ వినియోగిస్తున్నాడు. ఆ వ్యాలెట్ ధర 1,250 డాలర్లు అంటే దాదాపు 81,144 రూపాయలు ఉంటుందని అంచనా. అయితే ఒక్క బ్రాండ్‌తో వందల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకుంటున్న విరాట్‌కు ఎనభైవేలు లెక్కగాక పోవచ్చు.
తాజాగా బ్యాటరీల కంపెనీకి అంబాసిడర్‌గా:
రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో స్వతంత్ర్య బ్రాండుగా ఎదగాలనే కాంక్షతో లూమినస్ పవర్ టెక్నాలజీస్ అనే బ్యాటరీ కంపెనీ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంది. దాదాపు కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవాలంటే ప్రస్తుతం రూ. 242 కోట్ల వరకు చెల్లించాల్సిందే. ప్రపంచంలోని టాప్ 10 అంబాసిడర్లలో టాప్ చాలా మెరుగైన స్థానంలో ఉన్నాడు. ఫుట్‌బాల్ స్టార్ ప్రపంచంలోని ఐదో స్థానంలో ఉన్నాడు. అతని ధర కోహ్లీ కంటే తక్కువే.
ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న వారి జాబితాలో ధోనీతో పాటుగా కోహ్లీ కూడా చేరిపోయాడు. 2014లో 200 లక్షల డాలర్లు వరకు తీసుకుంటున్న సమయంలోనే కోహ్లీ ఫోర్బ్స్ జాబితాలో ఐదో స్థానం సంపాదించుకున్నాడు. కానీ, ధోనీ బ్రాండ్ వాల్యూ మాత్రం 2015 నుంచి 2016కి వంద లక్షల డాలర్ల వరకు పడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications