న్యూయార్క్‌లో అనుష్క శర్మతో కెప్టెన్ కోహ్లీ
హైదరాబాద్: శ్రీలంక పర్యటనకు ముందు కాస్తంత విరామం లభించడంతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇటీవలే వెస్టిండిస్‌లో పర్యటించింది.
ఈ పర్యటనలో భాగంగా వెస్టిండిస్‌తో ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడింది. ఐదు వన్డేల సిరిస్‌ను 3-1తేడాతో కైవసం చేసుకోగా, ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20లో కోహ్లీసేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. విండిస్ పర్యటన ముగిసిన అనంతరం కోహ్లీ నేరుగా అమెరికాకు వెళ్లాడు.
SPOTTED: #ViratKohli and #AnushkaSharma in New York!
A post shared by Cricket Shots (@cricketshots) on
అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో తన ప్రేయసి అనుష్క శర్మతో చక్కెర్లు కొడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు అనుష్క సైతం న్యూయార్క్‌లో తాను ఉంటున్న బస చేసిన ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.
A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on
జులై 26 నుంచి కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్‌ను ఆడనుంది. ఈ సిరిస్ జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు సాగనుంది.
ఈ క్రమంలో లంక పర్యటనకు ముందు లభించిన విరామ సమయాన్ని కోహ్లీ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. చివరిసారిగా 2015లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటించి టెస్టు, వన్డే సిరిస్‌ను కూడా సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications