రేపే తొలి టెస్టు: కాన్ఫిడెంట్‌గా కోహ్లీ, పిచ్‌ని పరిశీలించిన కుంబ్లే
హైదరాబాద్: ప్రస్తుతం టీమిండియా పటిష్టంగా ఉందని, ఆస్ట్రేలియా జట్టు గురించి ఆందోళన చెందడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టు నేపథ్యంలో పూణెలో బుధవారం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. జట్టుగా టీమిండియా ప్రస్తుతం అత్యుత్తమంగా రాణించడంపై కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు.
'మా జట్టు ఏంతో పటిష్టంగా ఉంది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు గురించి మేము ఆందోళన చెందడం లేదు. జట్టుతో పాటు ఆటగాడిగానూ, కెప్టెన్‌గా మెరుగవుతున్నాను. ఆసీస్ జట్టులో కొందరు మాత్రమే ఫామ్‌లో ఉన్నారు. నాకు 22 ఏళ్లున్ననప్పుడు 35 ఏళ్ల వ్యక్తులతో పోల్చి చూశారు. క్రమక్రమంగా నేను ఆ దశకు చేరుకుంటున్నా. క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా' అని కోహ్లీ అన్నాడు.
గురవారం నుంచి భారత్, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం నుంచి పూణెలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరుస టెస్టు సిరిస్ విజయాలతో ఉన్న టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే సిరిస్‌ను కూడా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆటగాళ్లు పూణెలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు.
తీవ్ర కసరత్తులు చేస్తున్న భారత ఆటగాళ్లు
కెప్టెన్ కోహ్లీ సహా జట్టులోని ప్రధాన ఆటగాళ్లు నెట్ సెషన్లకే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు బుధవారం టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌లు పూణె పిచ్‌ను పరిశీలించారు.
ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే తొలి రెండు టెస్టులకు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియాను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు పుణేలో తొలి టెస్టు జరుగుతుండగా, మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో రెండో టెస్టు జరగనుంది.

ఈ సిరిస్‌లో ఫెవరేట్‌గా బరిలోకి టీమిండియా
వరుస టెస్టు విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా ఈ సిరిస్‌లో ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. 2013 తరహాలోనే 4-0తో మరోసారి ఆసీస్ వైట్‌వాష్‌కు గురికాక తప్పదని హర్బజన్, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 2001లో జరిగిన సిరీస్‌లో హేడెన్, స్లేటర్, గిల్‌క్రిస్ట్, పాంటింగ్, స్టీవ్ వాలాంటి దిగ్గజాలుండగా.. ప్రస్తుత ఆసీస్ జట్టులో స్మిత్, వార్నర్ మాత్రమే ప్రధాన ఆటగాళ్లుగా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications