కోపంతో ఊగిపోయిన కోహ్లీ.. డగౌట్ వీడియో వైరల్!
ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన వివాదం చోటుచేసుకుంది. ఈ ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీపై ఘనవిజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా దాటిపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ప్లేయర్లు పరస్పరం షేక్ హ్యాండ్ చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. విరాట్ కోహ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోని మిగతా ఆటగాళ్లందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చాడు. కానీ ట్రావిస్ హెడ్ వంతు రాగానే కనీసం అతని వైపు చూడకుండా విరాట్ కోహ్లీ ముందుకు వెళ్లిపోయాడు. నిజానికి ట్రావిస్ హెడ్ తన చేతిని షేక్ హ్యాండ్ కోసం ముందుకు చాచినప్పటికీ.. విరాట్ కోహ్లీ అతన్ని పూర్తిగా విస్మరిస్తూ వెళ్లిపోవడం స్పష్టంగా కనిపించింది.

అయితే ఈ హ్యాండ్ షేక్ వివాదానికి ముందే విరాట్ కోహ్లీ తీవ్రమైన నిరాశ, కోపంతో ఊగిపోయినట్లు ఆర్సీబీ డగౌట్ నుంచి వచ్చిన మరో వీడియో ద్వారా తెలుస్తోంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో 17.4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మ్యాచ్ పూర్తిగా చేజారిపోయిందని అర్ధమయ్యాక బ్రాడ్‌కాస్టర్స్ కెమెరాలు డగౌట్లో కూర్చున్న కోహ్లీ వైపు తిరిగాయి. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ముఖంలో తీవ్ర అసహనం, నిరాశ కనిపించాయి. వెంటనే కోహ్లీ తన సీట్లోంచి లేచి, కోపంతో కాళ్లు బాదుకుంటూ లోపలి రూమ్‌లోకి వెళ్లిపోయాడు.
అసలు వీరిద్దరి మధ్య మైదానంలోనే మాటల యుద్ధం నడిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో ట్రావిస్ హెడ్ ఔటైనప్పుడు కోహ్లీ చాలా అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది హెడ్‌కు నచ్చలేదు. ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెంకటేష్ అయ్యర్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. కోహ్లీ పదే పదే హెడ్ వైపు చూస్తూ ఏదో కామెంట్స్ చేస్తూ కనిపించాడు. హెడ్ కూడా తగ్గకుండా సైగలతో కోహ్లీకి బదులిచ్చాడు. ఈ గొడవే మ్యాచ్ ముగిసినా కోహ్లీ మనసులో అలాగే ఉండిపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications