Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR VS RCB: స్పిన్నర్లను వణికిస్తోన్న విరాట్ కోహ్లీ కొత్త షాట్! (వీడియో చూశారా)

ఐపీఎల్ 2025ని గ్రాండ్ విక్టరీతో శుభారంభం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఏడు వికెట్ల తోడాతో గెలిచింది. ఫిల్ సాల్ట్‌తో కలిసి విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.

కోహ్లీ, ఫిల్ సాల్ట్‌ ద్వయం ఎంత విధ్వంసకరంగా ఆడిందంటే, వారిద్దరిని విడదీసేందుకు కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మ్యాచ్ నాలుగో ఓవర్‌లోనే వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపాడు. అయినా కూడా కోహ్లీ ఎక్కడా తగ్గలేదు. కొన్నిసెన్సేషనల్ షాట్స్ ఆడుతూ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 59 పరుగులతో చెలరేగాడు. అందులో స్లాగ్ స్వీప్ షాట్లు కూడా ఒకటి. దీనినే ప్రధానంగా ప్రత్యర్థి స్పిన్నర్లపై ఉపయోగించాడు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ పై ఈ షాట్లు బాదుతూ విరుచుకుపడ్డాడు. ఈ షాట్లే కోహ్లీ ఎక్కువ స్కోరు చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి.

Virat Kohli slog sweep shot becomes headache to opposition in KKR VS RCB match ipl 2025

ఆ షాట్లే ప్రధాన అస్త్రంగా..
ఇప్పుడు ఈ షాట్లు ప్రత్యర్థి జట్టు పెద్ద తలనొప్పిగా మారాయని అన్నారు అభినవ్ ముకుంద్, శిఖర్ ధావన్. స్పిన్నర్లు ఎదుర్కోవడానికి కోహ్లీకి ఈ షాట్లో ప్రధాన అస్త్రంగా మారాయని చెప్పారు. మ్యాచ్ అనంతరం వీరిద్దరూ కోహ్లీ బాదిన షాట్లు గురించి చర్చిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "స్పిన్‌తో కోహ్లీ దూకుడిని తగ్గించొచ్చని కెప్టెన్ భావించి ఉండొచ్చు. కానీ విరాట్ స్పిన్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం మొదలుపెడితే కెప్టెన్లు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే అతడు స్లాగ్ స్పీప్ షాట్లతో చెలరేగి ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఈ షాట్లు బాదుతాడని అస్సలు ఊహించలేదు. కోహ్లీ స్వీప్ షాట్లు.. స్పిన్నర్లుకు ఇబ్బందికరంగా మారింది. కోహ్లీ ఇలానే, ఇటువంటి షాట్లతో ఆడితే.. అతడు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది." అని ముకుంద్, ధావన్ కలిసి సంభాషించారు.

చరిత్ర సృష్టించిన కోహ్లీ..
విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు. నాలుగు జట్లపై 1000కిపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. తాజాగా మ్యాచ్ లో కేకేఆర్ పై 1000 పరుగుల మార్క్‌ దాటిన అతడు.. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్‌పై వెయ్యికిపైగా రన్స్ సాధించాడు. కాగా, ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ ను సీఎస్కేతో చెన్నై వేదికగా తలపడనుంది.

Story first published: Sunday, March 23, 2025, 7:44 [IST]
Other articles published on Mar 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+