Pahalgam Terror Attack: కట్టెలు తెంచుకున్న కోపం - భారత స్టార్ క్రికెటర్ల రియాక్షన్!
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఈ భీకర దాడికి పాల్పడ్డారు. సామాన్యులపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. దీంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతిఒక్కరూ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధ్యులు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా ఈ దాడిని ఖండిస్తూ.. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఐక్యంగా కలిసి ఉండాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్రికెటర్.. భీకర దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల గురించి ఏం అన్నారో తెలుసుకుందాం..
cricketers comments on Pahalgam Terror Attack: "పహల్గాంలో జరిగిన దాడి వార్త విని నా గుండె విరిగిపోయింది. బాధితులు, వారి కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నారు. వారి గురించే నా ఆలోచనంత. మన దేశంలో ఇలాంటి హింసకు ఎలాంటి చోటు ఉండకూడదు. శాంతి చేకూరాలని ఆశిస్తున్నా" అని కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ అన్నారు.
"పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడి బాధాకరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి సమయంలోనే మనమంతా మానవత్వంతో, ఐక్యంగా కలిసి ఉండాలి" అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
- "పహల్గాంలో ఉగ్రదాడి ఘటన తెలుసుకుని షాక్ అయ్యాను. ఎంతో తీవ్రంగా బాధించింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. ఈ భయంకరమైన భీకర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలు బలంగా తిరిగి కోలుకోవాలని ఆశిస్తున్నాను. కచ్చితంగా అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను" - అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
- "ప్రతిసారీ అమాయకులే జీవితాలను కోల్పోతున్నారు. కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఘటన హృదయవిదారకంగా ఉంది. కొన్ని రోజుల కిందటే అక్కడ ఉన్నా. ఈ బాధ మరింత ఎక్కువగా ఉంది'' - ఇర్ఫాన్ పఠాన్.
- "మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దురాఘాతానికి వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. భారత్ ప్రతీకారం తీసుకుంటుంది." - గౌతమ్ గంభీర్ అన్నాడు.

- "పహల్గాం దాడి ఘటన తీవ్రంగా బాధించింది. అమాయకమైన పర్యటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయం. బాధిత కుటుంబాలకు అండగా ఉందాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం" అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
- "ప్రతి సారి ఒక అమయకుడి ప్రాణం పోయినప్పుడల్లా, మానవత్వం ఓటమి చెందుతుంది. ఇవాళ కాశ్మీర్‌లో జరిగిన ఘటన చూసి నా గుండె బరువెక్కిపోయింది. కొన్ని రోజుల క్రితమే నేను అక్కడ ఉన్నాను. ఈ బాధ మరింత ఎక్కువగా అనిపిస్తోంది." అని ఇర్ఫాన్ పఠాన్ పోస్ట్ పెట్టాడు.
- "నన్ను ఈ విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధితుల గురించే నా ఆలోచన. వారి కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉంది" అని హార్దిక్ పాండ్య చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications