Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : డ్యాన్స్ గ్రూప్‌తో కాలు కదిపిన కోహ్లీ.. 76వ సెంచరీ సెలబ్రేషన్ ఇలాగే అంటున్న ఫ్యాన్స్!

Virat Kohli shows dance moves with quick style

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది వైరల్ అవడం ఖాయం. చాలా గ్యాప్ తర్వాత అహ్మదాబాద్‌లో టెస్టు శతకం కూడా సాధించిన కోహ్లీ ఇప్పుడు మంచి మూడ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో అతను తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రాం వీడియో తెగ వైరల్ అవుతోంది. పాపులర్ నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్‌తో కలిసి ఈ వీడియోలో కోహ్లీ కాలు కదిపాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత తిరిగి ముంబై వెళ్లిన కోహ్లీ.. ఈ గ్రూప్‌ను కలవడం జరిగింది.

'ముంబైలో ఎవరిని కలిశానో చూడండి' అంటూ నార్వేజియన్ డ్యాన్స గ్రూప్ 'క్విక్ స్టైల్'తో ఉన్న ఫొటోను కోహ్లీ షేర్ చేశాడు. ఆ తర్వాత తను డ్యాన్స్ వేసిన వీడియోను పోస్టు చేశాడు. దీనిలో క్విక్ స్టైల్‌లోని ఒక డ్యాన్సర్ తనకు దొరికిన క్రికెట్ బ్యాటుతో ఏం చేయాలో తెలియక తికమక పడతాడు. అప్పుడు అక్కడకు వచ్చిన కోహ్లీ అతని చేతిలోని బ్యాట్ తీసుకొని దాన్ని ఎలా వాడాలో చూపిస్తాడు. అదే సమయంలో అతని వెనక మిగతా డ్యాన్సర్లు కూడా చేరడంతో అందరూ డ్యాన్స్ చేసుకుంటూ ముందుకొస్తారు. స్టీరియో నేషన్‌ కంపోజ్ చేసిన ఇష్క్ పాటకు ఈ గ్రూప్ డ్యాన్స్ చేసింది.

ఈ డ్యాన్స్ వీడియోపై కోహ్లీ భార్య అనుష్క శర్మ, మాజీ లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తదితరులు స్పందించారు. ఒక ఫ్యాన్ అయితే '76వ సెంచరీ సెలబ్రేషన్ మూవ్ ఇదే.. లీక్ అయిపోయింది' అని కామెంట్ చేశాడు. ఇంతకుముందు కూడా తనలో ఒక డ్యాన్సర్ కూడా ఉన్నాడని కోహ్లీ చాలాసార్లు నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో మళ్లీ ఫామ్ అందుకున్న కోహ్లీ.. మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీసులో మళ్లీ మైదానంలో దిగుతాడు.

Story first published: Wednesday, March 15, 2023, 15:41 [IST]
Other articles published on Mar 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+