రాక్‌స్టార్‌గా కోహ్లీ: రెహ్మాన్ స్డూడియోలో పాట పాడాడు
చెన్నై: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త అవతారం ఎత్తాడు. ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరైన స్టేజిలపై డ్యాన్స్ చేసి అభిమానుల్ని అలరించిన కోహ్లీ తాజాగా తన గొంతుతో పాట పాడనున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కోరిక మేరకే విరాట్ ఇలా మారాడు.
ఐపీఎల్ మాదిరిగానే 'ప్రీమియర్ ఫుట్‌సల్ లీగ్' పేరిట ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాలతో కూడిన దేశీయ ఫుట్ బాల్ సిరీస్ కు జూలై 15న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్‌కు సంబంధించి ప్రమోషనల్ గీతాన్ని ఏఆర్ రెహ్మాన్ స్వరాలను సమకూర్చుతున్నారు.
దీంతో ఏఆర్ రెహ్మాన్ ఆహ్వానం మేరకు ఆయన స్టూడియోకు వెళ్లిన కోహ్లీ... త్వరలో ప్రారంభం కానున్నా 'ప్రీమియర్ ఫుట్‌సల్ లీగ్' కోసం పాట పాడాడు. రాక్‌స్టార్‌లా మైకు ముందు నిలబడి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications