Virat Kohli: కోహ్లీ రిటైర్ అవ్వద్దు.. నెట్టింట ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్

టీమిండియా అత్యంత ఘోరమైన ఓటమితో టీ20 ప్రపంచకప్‌ను ముగించింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ టోర్నీలో సెమీస్ చేరిన రోహిత్ సేన.. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడి ఇంటి దారి పట్టింది. దీంతో జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్ల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రపంచకప్‌లో అదరగొట్టిన కోహ్లీ..
గతేడాది ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టిన భారత జట్టు.. ఈ ఏడాది సెమీఫైనల్ చేరింది. ఇలా జట్టు సెమీస్ చేరడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన అతను.. ఆ తర్వాత కూడా దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
వెటరన్లు విఫలం..
ప్రపంచకప్‌లో టీమిండియా వెటరన్లు దాదాపుగా అందరూ విఫలమయ్యారు. రోహిత్ శర్మ మొత్తం ఆరు ఇన్నింగ్సులు ఆడి కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో సీనియర్ ప్లేయర్లు అయిన మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ పెద్దగా ఆకట్టుకోలేదు. వీళ్లందరి కన్నా యువ పేసర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించి పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ వెటరన్లు ఇక పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే బెటర్ అని అభిమానులు భావిస్తున్నారు.
కోహ్లీ వద్దు..
ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మతోపాటు కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఆసియా కప్, ప్రపంచకప్ రెండింట్లోనూ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, రోహిత్ మాత్రమే విఫలమయ్యాడని ఎత్తిచూపుతున్నారు.
దీంతో ఈ ఫార్మాట్‌కు కోహ్లీ వీడ్కోలు పలకాలనే వాదన తప్పు అంటున్నారు. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, అత్యధిక ఫోర్లు, టీ20 వరల్డ్ కప్ నాకౌట్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు.. ఇలా ఎన్నో రికార్డులు ఉన్న కోహ్లీ రిటైర్ అవ్వకూడదంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications