కోహ్లీ! నీ మొహాన్ని అద్దంలో చూసుకో: గవాస్కర్ తీవ్ర వ్యాఖ్య
బెంగళూరు: విరాట్ కోహ్లీ తన మొహాన్ని ఓసారి అద్దంలో చూసుకోవాలని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ విమర్శించారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో కోహ్లి ప్రదర్శనలపై గవాస్కర్ స్పందించారు.
భారీ స్కోరు సాధించడంలో అతడు విఫలం అవుతున్న దానికంటే, ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన అతను ఔటవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు.
ప్రస్తుతం కోహ్లీ చేయాల్సిన పని ఒక్కటేనని, అద్దం ముందు కూర్చొని తనను తాను చూసుకోవడమే అన్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో అతడు ఆడిన షాట్ కచ్చితంగా గొప్పదేమీ కాదన్నారు.

ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాతో మ్యాచ్‌లో ఆడిన షాట్ కూడా అద్భుతమైనది కాదన్నారు. ఆయన శుక్రవారం మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన విశ్లేషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. యువ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్‌లో కోహ్లీ బౌల్డ్ అయ్యాడు.
కాగా, 2016 ఐపీఎల్ టోర్నీలో అత్యధికంగా 973 పరుగుల సాధించిన కోహ్లి ప్రస్తుత సీజన్‌లో తడబడుతున్నాడు. గతేడాది కోహ్లీ ఒక్కడే నాలుగు శతకాలు సాధించాడు. ఈ సీజన్‌లో మాత్రం 8 మ్యాచులాడి 245 పరుగులే చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications