హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఆటగాడిగా స్టేడియంలో అద్భుతమైన షాట్లతో అలరించిన సెహ్వాగ్ వీడ్కోలు అనంతరం కామెంటేటర్‌గా తన ఛలోక్తులతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
కోహ్లీ ఓ సూపర్ స్టార్: 'క్రికెట్ ఎంతో అదృష్టం చేసుకుంది'
తన సహచర క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్ల పుట్టినరోజు నాడు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతున్నాడు. ట్విట్టర్ వేదికగా వీరూ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు పని చెబుతుంటాడు. ట్విట్టర్‌లో సెహ్వాగ్ ట్వీట్ చేశాడంటూ చాలు అది ఓ వైరల్ అయిపోతుంది. తాజాగా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని పేరు మార్చుకోవాలని సూచించాడు.

ఏం పేరు పెట్టుకోవాలో కూడా ట్వీట్ చేశాడు. వీరూ ఇలా కామెంట్ చేయడానికి కారణమేంటంటే.. ఈ ఏడాది కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బ్యాట్స్‌మన్‌గా, టెస్టు కెప్టెన్‌గా పలు రికార్డులను సృష్టిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో పరుగుల సగటు దాదాపు 90 శాతం ఉంది.
ఐదో టెస్టుకు ఆండర్సన్ దూరం: కోహ్లీపై వ్యాఖ్యలే కారణమా?
కోహ్లీ ప్రదర్శన ఫిదా అయిన సెహ్వాగ్, కోహ్లీని ప్రశంసిస్తూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని, అతను మెరుపులాంటివాడని కితాబిచ్చాడు. కోహ్లీ వెంటనే తన పేరును 'మెరుపు'గా మార్చుకోవాలని సూచించాడు.