For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాటింగ్ వైఫల్యం నుంచి బయటపడేందుకు విరాట్ కోహ్లీకి అద్దిరిపోయే అడ్వైజ్ ఇచ్చిన గవాస్కర్

Virat Kohli should call Sachin Tendulkar and seek advice, says Sunil Gavaskar
Virat Kohli కి అద్దిరిపోయే అడ్వైజ్ ఇచ్చిన Sunil Gavaskar || Oneindia Telugu

లండన్: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడం.. విమర్శలకు నోటికి పని చెప్పింది. మూడో టెస్ట్‌ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్త చేస్తోన్నారు. తొలి ఇన్నింగ్‌ బ్యాటింగ్.. బౌలింగ్.. ఈ రెండు విభాగాల్లో నాసిరకం ఆటతీరును ప్రదర్శించింది టీమిండియా. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన 78 పరుగులకు కుప్పకూలిపోయింది.

42 పరుగుల ఆధిక్యంలో..

42 పరుగుల ఆధిక్యంలో..

ఆ తరువాత బౌలింగ్‌లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించింది. ప్రత్యర్థి చెలరేగిన పిచ్‌పైనే తుస్సుమన్నారు టీమిండియా బౌలర్లు. మ్యాచ్ ముగిసేంత వరకూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. తొలి రోజే భారత జట్టుపై 42 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ 52, హసీబ్ హమీద్ 60 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ టెస్ట్ సిరీస్‌లో వారిద్దరికీ ఇదే తొలి అర్థసెంచరీ.

విరాట్ కోహ్లీ వైఫల్యాలపై..

విరాట్ కోహ్లీ వైఫల్యాలపై..

ప్రత్యేకించి- కేప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యం అభిమానులనే కాదు.. టీమిండియా మాజీ ప్లేయర్లు, లెజెండరీ క్రికెటర్లను కూడా కలవరపెడుతోంది. అతని చివరి సెంచరీ తరువాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 23.00గా నమోదైంది. చివరి 18 ఇన్నింగుల్లో మూడుసార్లు డకౌట్ అయ్యాడు.. మరో నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పెవిలియన్ బాట పట్టాడు. 641 రోజుల్లో విరాట్ కోహ్లీ చేసింది కేవలం మూడు హాఫ్ సెంచరీలే. అన్ని ఫార్మట్లలో కలిపి 50 ఇన్నింగులు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు బ్యాటింగ్ మిషన్.

సునీల్ గవాస్కర్ అడ్వైజ్..

సునీల్ గవాస్కర్ అడ్వైజ్..

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యంపై లెజెండరీ బ్యాట్స్‌మెన్, టీమిండియా మాజీ కేప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. విరాట్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌ సుదీర్ఘకాలం పాటు విఫలం కావడం మంచిది కాదని పేర్కొన్నారు. అతని బ్యాటింగ్ శైలి, ఆడుతోన్న తీరు తనను ఆందోళనకు గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. ఆఫ్ స్టంప్ మీదికి వచ్చే బంతులను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోతోన్నాడని పేర్కొన్నాడు. ఆఫ్ స్టంప్‌పైకి వచ్చే బంతులను డ్రైవ్ చేయడంలో విఫలమౌతోన్నాడని అన్నారు. ప్రతీసారీ ఇదే విధంగా అవుట్ కావడం ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్లకెవరికీ మంచిది కాదని చెప్పారు.

 సచిన్ నుంచి సలహా

సచిన్ నుంచి సలహా

బ్యాటింగ్ వైఫల్యం నుంచి వెంటనే బయటపడటానికి విరాట్ కోహ్లీ సచిన్ టెండుల్కర్ నుంచి సలహా తీసుకోవాలని సునీల్ గవాస్కర్ సూచించారు. 2003-04లో ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన సందర్భంగా సచిన్ టెండుల్కర్ తొలి రెండు టెస్టుల్లో విఫలమైన సందర్భాన్ని గవాస్కర్ గుర్తు చేశారు. తొలి టెస్టులో 1, 37, రెండో టెస్టులో 0,44 పరుగుల తరువాత సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. 241 పరుగులతో సచిన్ టెండుల్కర్ నాటౌట్‌గా నిలిచాడు.

విరాట్‌దీ అదే పరిస్థితి..

విరాట్‌దీ అదే పరిస్థితి..

విరాట్ కోహ్లీ కూడా ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నాడని, దీన్ని నుంచి కోలుకోవడానికి సచిన్ టెండుల్కర్ నుంచి టెక్నిక్ సపోర్ట్ తీసుకోవాలని సునీల్ గవాస్కర్ సూచించారు. కవర్ డ్రైవ్‌ల జోలికి వెళ్లొద్దని సచిన్ సలహా ఇస్తాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఏ షాట్ ఆడటంలో తాను బలహీనంగా ఉన్నానో.. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. కవర్ డ్రైవ్ ఆడటంలో విఫలమౌతున్నానని తెలిసి కూడా కోహ్లీ అదే షాట్ ఆడటం సరికాదని, ఆ బలహీనత నుంచి అతను గట్టెక్కాలని అన్నారు.

Story first published: Thursday, August 26, 2021, 8:55 [IST]
Other articles published on Aug 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+