
టీవీ యాడ్‌లో అనుష్క శర్మతో కోహ్లీ
ఫిల్మ్‌ఫేర్ తన అధికారిక ఇనిస్టాగ్రామ్‌లో ‘అనుష్కశర్మ, విరాట్ కోహ్లిలు ఇప్పుడే ఓ యాడ్‌లో నటించారు' అనే క్యాప్షన్‌తో ఓ ఫోటోను పోస్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ యాడ్‌లో వీరిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని అంటున్నారు.
వీరిద్దరూ తొలిసారి కలిసింది ఓ యాడ్ షూటింగ్‌లోనే
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిద్దరూ తొలిసారి కలిసింది కూడా ఒక యాడ్ షూటింగ్‌లోనే. 2013లో ఓ హేయిర్ షాంపో యాడ్‌లో వీరిద్దరూ కలిసి తొలిసారి నటించారు. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమలో పడ్డారు. ఈ యాడ్ భారత్‌లో రాబోయే పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని తీశారు.
దుస్తుల కంపెనీకి సంబంధించిన యాడ్
ఇది ఓ దుస్తుల కంపెనీకి సంబంధించిన యాడ్‌గా తెలుస్తోంది. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు కలిసి నటిస్తున్న రెండో యాడ్ ఇది. ఇటీవలే ముగిసిన శ్రీలంక పర్యటనలో కూడా వీరిద్దరూ కలిసి హల్ చల్ చేసిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

శ్రీలంక పర్యటనలో చెట్టు నాటిన అనుష్క, కోహ్లీ
మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా బస చేసిన అలియా రిసార్ట్ అండ్ స్పాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు కలిసి చెట్టు నాటారు. వీరిద్దరూ కలిసి చెట్టుని నాటుతుండగా తీసిన ఫోటోలు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ క్లబ్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఫోటోలు
ఈ ఇద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీలంకతో సిరీస్ తర్వాత ఆసీస్ సిరీస్‌కు మధ్య కాస్త గ్యాప్ దొరకడంతో విరాట్ కోహ్లీ ఈ ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. అటు ఈ మధ్యే జబ్ హ్యారీ మెట్ సేజల్ మూవీ తర్వాత పరీ అనే మూవీలో అనుష్క నటిస్తోంది. ఈ మూవీలో షారుక్ ఖాన్ మరగుజ్జుగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











