
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈరోజు డిసెంబర్ 31 (ఆదివారం) కావడంతో భారత జట్టు క్రికెటర్లు న్యూ ఇయర్ మూడ్‌లోకి వచ్చేశారు. ఇందులో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న కేప్ టౌన్ వీధుల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశారు.
కేప్ టౌన్ వీధుల్లో నిర్వహించిన ఓ మ్యూజిక్ షోలో భాగంగా వీరిద్దరూ పంజాబీ స్టెప్పులతో అదరగొట్టారు. వీరిద్దరూ డ్యాన్స్ చేస్తున్న సమయంలో ధావన్ కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. వీరి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దక్షిణాఫ్రికా పర్యటనకు క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లేందుకు బీసీసీఐ అంగీకరించిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెటర్లు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో కలిసి కేప్‌టౌన్ వీధుల్లో తిరుగుతున్నారు. ఇక, గాయంతో తొలి టెస్టుకు శిఖర్ ధావన్ దూరమయ్యాడు.
ఓపెనర్ మురళీ విజయ్‌తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కోహ్లీసేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా జనవరి 5 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.