Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘ప్రతి భారత క్రికెటర్‌కి తన భార్య అంటే భయం’ (వీడియో)

 Virat Kohli, Shikhar Dhawan and more: Harbhajan Singh reveals the secrets of most Indian cricketers

హైదరాబాద్: భారత జట్టులో పెళ్లి చేసుకున్న ప్రతి క్రికెటర్‌కి వాళ్ల భార్య అంటే ఎంతో భయమట. ఈ విషయాన్ని టీమిండియా వెటనర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. వరుసగా టోర్నీలు, విదేశీ పర్యటనల నేపథ్యంలో జట్టులోని ఆటగాళ్లు తమ కుటుంబసభ్యుల కంటే ఎక్కువ సమయాన్ని సహచర ఆటగాళ్లతోనే గడుపుతుంటారు.

దీంతో ఎన్నో విషయాలను వారు షేర్ చేసుకుంటారు. తాజాగా హార్భజన్ సింగ్ 'పోల్ ఖోల్ బై భజ్జీ' అనే చాట్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెటర్లకు సంబంధించి కొన్ని సీక్రెట్స్‌ను భజ్జీ అభిమానులతో పంచుకున్నాడు. 'ప్రతి భారత క్రికెటర్‌కి తన భార్య అంటే భయం' అని చెప్పాడు.

అంతేకాదు విదేశీ పర్యటనల్లో ఏ ఆటగాడు ఎక్కువగా భార్యను మిస్‌ అయినట్లు ఫీలవుతుంటాడు అని అడగ్గా 'ఇంకెవ్వరూ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌' అని నవ్వుతూ బదులిచ్చాడు. ఇక, డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ బాగా జోకులు పేలుస్తుంటాడని మరో ప్రశ్నకు జవాబుగా భజ్జీ చెప్పాడు.

'సురేశ్‌ రైనా ఎప్పుడు చూసినా ఫోన్‌తో బిజీగా గడుపుతాడు. ఇక ఆశిష్‌ నెహ్రా మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో నిర్వహించే జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చేవాడని, విదేశీ పర్యటనల్లో ఎక్కడికైనా బయటకు వెళ్లాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెబితే జహీర్‌ ఖాన్‌ చాలా ఆలస్యంగా వచ్చేవాడని తెలిపాడు.

జట్టు మొత్తంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ మంచి భోజన ప్రియుడని భజ్జీ ఈ సందర్భంగా వెల్లడించాడు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో హార్భజన్ సింగ్ నేతృత్వం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి చెన్నై ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Story first published: Monday, June 4, 2018, 17:23 [IST]
Other articles published on Jun 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+