Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోపంలో స్టంప్స్‌ను కాలితో తన్నిన కెప్టెన్ కోహ్లీ (వీడియో)

Virat Kohli shatters stumps in anger during 2nd T20I against South Africa in Mohali

హైదరాబాద్: మొహాలీలోని పీసీపీ స్టేడియంలో స్టంప్‌లు బుధవారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాయి. వాషింగ్టన్ సుందర్ మిస్ ఫీల్డింగ్ చేసిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన కోపాన్ని స్టంప్స్‌పై చూపించాడు. చాలా రోజుల మైదానంలో విరాట్ కోహ్లీ మరోసారి తన దూకుడిని ప్రదర్శించాడు.

నిజానికి విరాట్ కోహ్లీ మైదానంలో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటాడు. జట్టులోని మిగతా సభ్యులు ఎవరైనా మిస్ ఫీల్డింగ్ లేదా అప్రమత్తంగా ఉన్నా... విరాట్ కోహ్లీ అదే సమయంలో వారిపై తన కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. మొహాలీ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వాషింగ్టన్ సుందర్ చేసిన చిన్నపాటి తప్పిదానికి కోపంతో ఊగిపోయిన కోహ్లీ అమాంతం తన కాలితో స్టంప్ప్‌ను తన్నాడు.

ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఘటన

ఈ సంఘటన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో చోటు చేసుకుంది. బౌండరీతో దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డీకాక్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ బౌండరీని వాషింగ్టన్ ఆపడంలో విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే, మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

7 వికెట్ల తేడాతో భారత్ విజయం

7 వికెట్ల తేడాతో భారత్ విజయం

ఈ మ్యాచ్‌లో 150 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ 52 బంతుల్లో 72 నాటౌట్‌(4ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణంచగా... ఓపెనర్ ధావన్‌(40; 31 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌) ఫరవాలేదనిపించాడు.

టీమిండియాకు మంచి శుభారంభం

టీమిండియాకు మంచి శుభారంభం

లక్ష్య చేధనలో టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించిన అనంతరం రోహిత్‌(12)ను ఫెలుక్‌వాయో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించారు.

రెండో వికెట్‌కు 61 పరుగులు

రెండో వికెట్‌కు 61 పరుగులు

ఈ క్రమంలో రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 61 పరుగులు జోడించారు. షంసీ బౌలింగ్‌లో ధావన్ బౌండరీ వద్ద డేవిడ్ మిల్లర్‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధావన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌ మరోసారి నిరాశపరిచాడు. ఫార్చూన్ బౌలింగ్‌లో పంత్‌(4) పేలవమైన షాట్‌ ఆడి వెనదిరిగాడు. శ్రేయాస్‌ అయ్యర్‌(16 నాటౌట్‌)తో కలిసి కోహ్లీ టీమిండియాకు విజయాన్ని అందించాడు.

కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

సఫారీ బౌలర్లలో ఫెలుక్‌వాయో, ఫార్చూన్, షమ్సీలు తలో వికెట్‌ దక్కించుకున్నారు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. అంతకముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డీకాక్ 37 బంతుల్లో 52(8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా... బవుమా 43 బంతుల్లో 49(3 ఫోర్లు, ఒక సిక్స్)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

Story first published: Thursday, September 19, 2019, 19:20 [IST]
Other articles published on Sep 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+