For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మగాళ్ల కన్నా మహిళలకే బలమెక్కువ.. అదో అద్భుతమైన అనుభవం! కోహ్లీ ఎమోషనల్‌ ట్వీట్!

Virat Kohli shares wife Anushka Sharma, daughter Vamikas pic on International Womens Day
Virat Kohli Salutes Female Divinity, Shares Adorable Photo Of Anushka And Daughter Vamika

హైదరాబాద్: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ జీవితంలో స్త్రీ ప్రాముఖ్య‌త‌ను గుర్తు చేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌న స‌తీమ‌ణి అనుష్క శర్మ, కూతురు వామికా ఫొటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్‌ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన మహిళలందరికీ 'మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' తెలిపాడు. అంతేకాదు మగవాళ్ల కన్నా మహిళలకే బలం ఎక్కువ ఉంటుందని, తన జీవితంలో కూతురు జన్మించిన రోజు మరిచిపోలేని విరాట్ పేర్కొన్నాడు.

 మగాళ్ల కన్నా మహిళలకే బలమెక్కువ:

మగాళ్ల కన్నా మహిళలకే బలమెక్కువ:

కుమార్తె వామికాను ఎత్తుకున్న అనుష్క శర్మ ఫొటోను విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఫొటోలో తన కూతురుతో ఎంతో ఉల్లాసంగా ఆడుకుంటూ అనుష్క ఉన్నారు. 'పిల్లల పుట్టుకను గమనిస్తే.. వెన్నెముకలో వణుకు వస్తుంది. అదో అద్భుతమైన అనుభవం. దాన్ని ఎవరైనా ప్రత్యక్షంగా చూసిన తరువాత మహిళల నిజమైన బలం, దైవత్వాన్ని అర్థం చేసుకుంటారు. దేవుడు వారి కడుపులో మరో జీవితాన్ని ఎందుకు సృష్టించాడు?. మహిళలు పురుషుల కంటే బలంగా ఉన్నారు కాబట్టే. నా జీవితంలో ఇది మరిచిపోలేని విషయం. వామికా కూడా తన తల్లిలా ఎదుగుతుందని భావిస్తున్నా. ప్రపంచంలోని అద్భుతమైన మహిళలందరికీ 'మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'' అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

జనవరి 11న వామికా జననం:

జనవరి 11న వామికా జననం:

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. అనుష్క డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను కోహ్లీ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. పాపా పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను షేర్ చేసి చిన్నారి పేరును వెల్లడించారు.

అహ్మదాబాద్‌లో అనుష్క:

అహ్మదాబాద్‌లో అనుష్క:

అయితే విరుష్కా జోడీ తమ కూతురి పేరు ప్రకటించాక 'వామికా' పేరు అర్థం తెలుసుకోవడం కోసం అభిమానులంతా గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. వామికా అంటే దుర్గామాతకు మరో పేరని పండితులు పేర్కొన్నారు. శివుడి అర్థనారీశ్వరుడి రూపాన్ని కూడా వామికా అని పిలుస్తారట. ఇక విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసొచ్చేలా 'వామికా' అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో మ్యాచులు ఆడుతోంది. టీ20 సిరీస్ కోసం కోహ్లీసేన అహ్మదాబాద్‌లో ఉంది. అనుష్క కూడా విరాట్‌తోనే ఉన్నారు. ఇటీవల పాపతో కలిసి అనుష్క అక్కడికి వెళ్లారు.

సాహా కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో:

అహ్మదాబాద్ వేదికగానే శుక్రవారం నుంచి ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుండగా.. ప్రస్తుతం భారత క్రికెటర్లు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కుమారుడి పుట్టినరోజు వేడుకలకి భారత క్రికెటర్లతో పాటు విరుష్క జోడీ కూడా హాజరైంది. సాహా కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో విరుష్క జోడీ ప్రముఖంగా కనిపించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక టెస్ట్ సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా సాహాకి తుది జట్టులో అవకాశం దక్కలేదు.

India vs England: అతడో తెలివైన బౌలర్‌.. అత్యంత వేగంగా 100 వికెట్లు తీస్తాడు! అక్తర్‌ జోస్యం

Story first published: Monday, March 8, 2021, 15:14 [IST]
Other articles published on Mar 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+