వైరల్ ఫొటో: హాలిడే వెకేషన్.. సముద్ర తీరాన అనుష్కతో కోహ్లీ!!

ముంబై: తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విరామం దొరకడం చాలా అరుదు. ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ హోదాలో మీడియా సమావేశాలు, బోర్డు మీటింగ్‌లలో పాల్గొంటూ చాలా బిజీగా ఉంటాడు. అయితే దొరికిన కొద్ది సమయంను మాత్రం కుటుంబంకు కేటాయిస్తాడు. ఈ క్రమంలో తన భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో సరదా సమయం గడుపుతూ.. ఆమె ప్రేమలో తడిచి ముద్దవుతాడు.

అనుష్కతో విహార యాత్ర:
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్ నుంచి రన్‌మెషీన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి లభించింది. గురువారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో సమావేశం ముగిసిన అనంతరం అనుష్కతో కలిసి కోహ్లీ విహార యాత్రకు వెళ్ళాడు. ఓ అందమైన ప్రదేశంలోని కొండ కోనల్లో, వాగు వంకల్లో అనుష్కతో కలిసి చక్కర్లు కొట్టాడు. అనుష్కపై తనకెంత ప్రేముందో చూపించాడు. ఈ విహార యాత్రకు సంబందించిన పోటోలను కోహ్లీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

అనుష్కకు ప్రేమతో:
ఫొటోలతో పాటు హృదయాకారపు ఎమోజీలను పోస్ట్ చేసాడు. 'అనుష్కకు ప్రేమతో' అని అర్థం వచ్చేలా ఎమోజీలను ఉంచాడు. వెనకాల నీలం రంగులో మెరుస్తున్న సముద్ర జలాలు, ఆకుపచ్చ రంగుల్లో కొండలు ఉన్న ఈ చిత్రం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలకు ఫిదా అయిన అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అంతేకాదు బెస్ట్ కపుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అప్పటివరకు సెలవులే:
బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్ నవంబర్ 10న ముగియనుండగా.. టెస్ట్ సిరీస్ 14 నుండి ప్రారంభం కానుంది. అప్పటివరకు కోహ్లీకి సెలవులే. మరి కోహ్లీ ఇంకా ఎన్ని ప్రదేశాలు చుట్టొస్తాడో చూడాలి. ఇలా విహార యాత్రకు వెళ్లడం కోహ్లీకి కొత్తేమీ కాదు. ఇటీవల లండన్, విండీస్ వీధుల్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ ఇద్దరూ తమ వృత్తులలో బిజీగా ఉన్నా.. వ్యక్తగత జీవితానికి సమయం కేటాయిస్తున్నారు.

గంగూలీతో సమావేశం:
బీసీసీఐ కొత్త బాస్ సౌరవ్ గంగూలీని విరాట్ కోహ్లీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు గురువారం కలిశారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు జట్టు ఎంపిక సందర్భంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి కార్యదర్శి జై షా, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ హాజరయ్యారు. వీరంతా కలిసి భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ గురించి చర్చించారు. టీ20 ప్రపంచకప్ కోసం మంచి జట్టును ఇప్పటి నుండే తయారుచేయాలని నిర్ణయించారట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications