కోహ్లీ వైరల్ ఫోటో: అప్పుడు స్లిప్పర్లు.. ఇప్పుడు ప్యూమా షూ!!

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. వ్యక్తిగత విషయాలు, మ్యాచ్‌లకు సంబందించిన సమాచారం తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా కోహ్లీ పోస్టు చేసిన ఒక ఫొటో వైరల్ అయింది. ఈ పోస్టులో కోహ్లీ రెండు ఫొటోలను జతచేసాడు.

10 ఏళ్ల ప్రస్థానం
కోహ్లీ షేర్ చేసిన పోస్టులో ఒక ఫొటో పదేళ్ల కిందటి ఫొటో కాగా.. మరొకటి తాజా ఫొటో. పదేళ్ల కిందటి ఫొటోలో స్లిప్పర్లను పట్టుకోగా.. తాజా ఫొటోలో ప్యూమా షూస్ పట్టుకున్నాడు. రెండు ఫొటోలను కంపేర్ చేస్తూ.. తొలి ఫొటోతో జర్నీని ప్రారంభించానని, రెండో ఫొటలో ప్రస్తుతమున్న స్థానం అని కోహ్లీ చెప్పకనే చెప్పాడు. ఈ పోస్టుకు ఓ క్యాప్షన్ కూడా జత చేశాడు. 'స్లిప్పర్లతో ప్రారంభించి ప్రస్తుతం ఇక్కడ ఉన్నా' అని రాసుకొచ్చాడు. ప్యూమా క్రికెట్ అని హాష్ టాగ్ జతచేసాడు.

జింబాబ్వేపై అరంగేట్రం
కోహ్లీ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోహ్లీ ఆసక్తికర పోస్టుని చూసి అభిమానులు త్రిల్ అవుతున్నారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫొటోకు చాలా లైకులు, కెమెంట్లు వచ్చాయి. 2008లో అండర్-19 ప్రపంచకప్ గెలవడంతో కోహ్లీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 2010లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన కోహ్లీ.. ఈ పదేళ్లలో తిరుగులేని ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు టీమిండియా తరపున 84 టెస్టులు, 242 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. టెస్టులలో 7202 పరుగులు, వన్డేలలో 11609 పరుగులు, టీ20లలో 2633 పరుగులు చేసాడు.

సరికొత్త హెయిర్ స్టైల్‌లో కోహ్లీ
కొత్త సంవత్సరంలో కోహ్లీ సరికొత్తగా రాబోతున్నాడు. ఈ ఏడాదిని కొత్తగా ఆరంభించాలని అనుకున్న కోహ్లీ.. సరికొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమివ్వనున్నాడు. కోహ్లీ తాజాగా 'టాప్ కట్' అనే హెయిర్ కట్‌ను చేయించుకున్నాడు. స్టార్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హాకీమ్ ఈ 'టాప్ కట్' హెయిర్ కట్‌ను చేసాడు. ఈ సరికొత్త లుక్‌కు సంబందించిన పోటోలను హకీమ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. 'న్యూ ఇయర్.. న్యూ కట్.. ది కింగ్' అని హకీమ్ రాసుకొచ్చాడు.
సినీ నటులతో సందడి
వెస్టిండీస్‌తో సరీస్ ముగిశాక లభించిన రెండు వారాల విశ్రాంతని కోహ్లీ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను స్విట్జర్లాండ్‌లో సతీమణి అనుష్కతో కలసి జరుపుకున్నారు. అక్కడే సినీ నటులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, వరుణ్ ధావన్, నటాషా దలాల్‌తో కలిసి సందడి చేశారు. ఆదివారం నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ స్వదేశానికి చేరుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications