Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ సీక్రెట్ బయటపెట్టిన కోహ్లీ

Rohit Sharma and Virat Kohli: నేడు స్నేహితుల దినోత్సవం. ఆగస్టులో వచ్చే తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కేప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

స్పోర్ట్స్‌లోనే కాకుండా అనేక విషయాల్లో తాను, రోహిత్ శర్మ ఒకేలా ఆలోచిస్తామని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్ ఆడేటప్పుడు తామిద్దరం క్రీజ్‌లో ఉంటే ఒత్తిడి ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంపైనే ఎప్పుడూ డిస్కస్ చేస్తామని చెప్పుకొచ్చాడు. పెద్ద జట్లతో ఆడుతున్న సమయంలో.. తమ తరువాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పడకుండా ఉండటానికి రోహిత్ శర్మ ప్రాధాన్యత ఇస్తాడని అన్నాడు.

Virat Kohli shares his thought about Rohit Sharma on the occasion of Friendship day

ఎంత పెద్ద రిస్క్ అయినా, ప్రెషర్ అయినా దాన్ని తీసుకోవడానికి రోహిత్ ఎప్పుడూ వెనుకాడబోడని, అదే అతని విజయ రహస్యమని వ్యాఖ్యానించాడు. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు తన ఆటతీరును మలచుకుంటూ ఉంటాడని పేర్కొన్నాడు. ఒత్తిడి నుంచి బయటపడటానికి తామిద్దరం భారీషాట్లను ఆడతామని, తరువాత వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే పరిస్థితులను కల్పిస్తామని అన్నాడు.

మ్యాచ్‌ను గెలిపించడం అనేది ఒక్కటే రోహిత్ శర్మ మెయిన్ గోల్‌గా ఉంటుందని, అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటాడని చెప్పాడు. అతని బ్యాటింగ్.. ఒక్కసారి వేగం పుంజుకొంటే దాన్ని ఎవరూ ఆపలేరని,ఎలాంటి బౌలర్ అయినా లెక్క చేయడని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు.

టీ20, వన్డే, టెస్ట్.. ఇలా ఫార్మట్ ఏదయినా గెలిచి తీరాలనే తపన రోహిత్ శర్మలో అధికంగా కనిపిస్తుంటుందని విరాట్ కోహ్లీ చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత తామిద్దరం ఈ ఫార్మట్ నుంచి ఒకేసారి రిటైర్మెంటో ప్రకటించామని, జీవితాంతం గుర్తుండిపోయేలా ట్రోఫీతో ఓ ఫొటో దిగాలని రోహిత్‌ను కోరగా అందుకు అంగీకరించాడని వివరించాడు.

Story first published: Sunday, August 4, 2024, 13:11 [IST]
Other articles published on Aug 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+