అతనెంటే ఎంతో ఇష్టం: విరాట్ కోహ్లీ 'ఫ్యాన్ బాయ్' మూమెంట్
హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్న క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత అంతటి భారీ అభిమానులు కోహ్లీ సొంతం. తనకు ఎంతమంది అభిమానులు ఉన్నప్పటికీ కోహ్లీ కూడా ఒకరికి అభిమానిగా ఉన్నాడు.
తనకు ఇష్టమైన స్టార్‌ని చూసి అభిమానులు ఎలా ఉబ్బితబ్బిబ్బయి వారితో ఓ సెల్ఫీ లేదంటో ఓ ఫొటో దిగేందుకు ఆసక్తిని కబరుస్తుంటారు. సరిగ్గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇలానే చేశాడు. తన కిష్టమైన బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్‌తో కలిసి ఫొటో తీసుకున్నాడు.

హృదయాన్ని హత్తుకునేలా పాడి.. సంగీతంలో ఓలలాడించే బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ అంటే తనకు చాలా ఇష్టమట. అతనికి కోహ్లీ వీరాభిమాని అట.. ఈ విషయాన్ని కోహ్లీ తాజాగా ట్వీట్ చేశాడు. 'నాకు ఫ్యాన్‌బాయ్ మూమెంట్ ఇది. ఎంత అద్భుతమైన వ్యక్తి. ఇతనిలా మరెవరి స్వరమూ నన్ను కట్టిపడేయలేదు. అర్జిత్, దేవుడు నిన్ను దీవించుగాక' అంటూ అర్జిత్ సింగ్‌తో దిగిన ఫోటోని కోహ్లీ పోస్టు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications