Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

#TransformationThursday: కోహ్లీ ఇనిస్టా ఫోటోపై పీటర్సన్ సరదా కామెంట్

Virat Kohli shares decade-old photo, Kevin Pietersen responds

హైదరాబాద్: ఈ దశాబ్దంలో 20 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేయడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం తన ఇనిస్టాగ్రామ్‌లో #TransformationThursday పేరిట పదేళ్ల క్రితం నాటి ఫోటోతో పాటు ఇప్పటి ఫోటోను జత చేసి అభిమానులతో పంచుకున్నాడు.

మొదటి ఫోటోలో విరాట్ కోహ్లీ బొద్దుగా, ముద్దుగా ఉండగా... రెండో ఫోటోలో ప్రస్తుత కోహ్లీ ఫోటోను జత చేశాడు. ఈ ఫోటోకి "క్రమంగా పరివర్తన చెందడంపై ఇది నా రియాక్షన్‌. నా నిలకడైన క్లియర్‌ కట్‌ ఫెర్ఫార్మెన్స్‌కు ఇక్కడ ఫిలిప్స్‌ ట్రిమ్మర్‌కు థాంక్స్‌!!" అని కామెంట్ సైతం పెట్టాడు. కాగా, విరాట్ కోహ్లీ పోస్టుకి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఫన్నీగా మరో కామెంట్ పెట్టాడు.

కోహ్లీ పోస్టు చేసిన ఫోటోకి పీటర్సన్ "ఎడమవైపు ఉన్న అబ్బాయి ఎవరో నాకు తెలుసు" అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా, ఈ ఏడాది విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు వన్డేల్లో విరాట్ కోహ్లీ 43 సెంచరీలు చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ 1377 పరుగులు చేశాడు. కాగా, మూడు ఫార్మాట్లలో కలిపి 2,455 పరుగులు చేసాడు.

దీంతో వరుసగా నాలుగేళ్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2016లో 2,595 పరుగులు.. 2017లో 2,818 పరుగులు.. 2018లో 2,735 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 11,609 పరుగులతో ఏడో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో సచిన్ (18,426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్‌ (13,704), జయసూర్య (13,430), మహేల జయవర్ధనే (12,650), ఇంజమాముల్ హక్‌ (11,739)లు వరుసగా ఉన్నారు. ఇక, టెస్టుల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ 27 సెంచరీలు చేశాడు.

ఈ ఏడాది దక్షిణాఫ్రికాపై మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకోవడంతో భారత్ తరుపున అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించాడు. విజ్డన్ ప్రకటించిన దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో కూడా కోహ్లీకి చోటు దక్కింది.

Story first published: Thursday, December 26, 2019, 17:42 [IST]
Other articles published on Dec 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+