Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నీ ప్రేమతో నన్ను పూర్తిగా మార్చావ్: ఖేల్‌రత్న తర్వాత అనుష్కపై కోహ్లీ

 Virat Kohli shares an adorable post for Anushka Sharma after Khel Ratna award

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ మీద ఉన్న ప్రేమను ఇనిస్టాగ్రామ్ వేదికగా మరోసారి చాటుకున్నాడు. బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా విరాట్ కోహ్లీ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్‌ ఖేల్‌రత్న' అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

Virat Kohli Receives Rajiv Gandhi Khel Ratna Award

కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క ఫోటోను షేర్‌ చేస్తూ "ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగేలా.. సరైన మార్గంలో నడిచేలా నాలో స్ఫూర్తి నింపే వ్యక్తి. లోపల, బయట రెండు రకాలుగా నన్ను మార్చి.. నిజమైన ప్రేమలోని శక్తి ఏంటో తెలుసుకునేలా చేసిన వ్యక్తి.. నా బలం. నా సోల్‌మెట్‌" అని కోహ్లీ పేర్కొన్నాడు.

బుధవారం కోహ్లీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా 'ఖేల్‌ రత్న' పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కోహ్లీ తల్లితో పాటు భార్య అనుష్క శర్మ కలిసి హాజరయ్యాడు. మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిల తర్వాత ఈ పురస్కరాన్ని అందుకున్న మూడో క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.

Story first published: Thursday, September 27, 2018, 12:19 [IST]
Other articles published on Sep 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+