3-0తో క్లీన్‌స్వీప్:కెప్టెన్‌గా అజహర్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ,డుప్లెసిస్ చెత్త రికార్డు

హైదరాబాద్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగులతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై 3-0తో సిరిస్‌ను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాడు.
దక్షిణాఫ్రికా జట్టుపై కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే తొలి వైట్‌వాష్ సిరిస్ కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజహరుద్దీన్ రికార్డుని అధిగమించాడు. టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక వైట్‌వాష్‌లు(మూడు టెస్టులు లేదా అంతకమించి) చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా
అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా రెండు సిరిస్‌లను వైట్ వాష్ చేయగా... విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు సార్లు ప్రత్యర్ధి జట్లను వైట్‌వాష్ చేసింది. 1993లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై అజహర్ నాయకత్వంలోని టీమిండియా 3-0తో టెస్టు సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత 1994లో శ్రీలంకపై(3-0)తో టెస్టు సిరిస్‌ను టీమిండియా నెగ్గింది.

2013లో భారత పర్యటనకు
ఆ తర్వాత ధోని నాయకత్వంలోని టీమిండియా కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 2013లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుపై ధోని నాయకత్వంలోని టీమిండియా 4-0తో టెస్టు సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కోహ్లీ విషయానికి వస్తే 2016లో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా 3-0తో సిరిస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

టీమిండియా ఆరు సార్లు
ఆ తర్వాత 2017లో శ్రీలంకపై ఆ దేశంలో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై 3-0తో సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా చూస్తే టీమిండియా ఆరు సార్లు తన ప్రత్యర్ధి జట్లను క్లీన్ స్వీప్ చేసింది. 3-0తో టెస్టు సిరిస్‌ను చేజార్చుకోవడంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

వరుసగా టెస్ట్ సిరీస్‌ను
భారతదేశంలో వరుసగా టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ నిలిచాడు. 2015లో డుప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, రాంచీ టెస్టులో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సఫారీలపై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం.

132/8 ఓవర్‌నైట్ స్కోరుతో
మంగళవారం నాలుగో రోజు ఆటలో భాగంగా 132/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మరో ఒక పరుగు మాత్రమే సాధించి ఆలౌటైంది. కేవలం 12 బంతుల్లోనే దక్షిణాఫ్రికా చివరి రెండు వికెట్లను కోల్పోయింది. డి బ్రుయిన్(30) తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరగా,. లుంగీ ఎంగిడి డకౌటయ్యాడు. చివరి రెండు వికెట్లు నదీమ్‌కే దక్కాయి.

షమీకి మూడు వికెట్లు
భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, నదీమ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. జడేజా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది.
స్కోరు వివరాలు:
తొలి ఇన్నింగ్స్
ఇండియా - 497/9 decl
దక్షిణాఫ్రికా - 162
రెండో ఇన్నింగ్స్
దక్షిణాఫ్రికా(ఫాలోఆన్) - 133
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications