
మరొక్క పరుగు
పుణె వేదికగా శుక్రవారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరొక్క పరుగు చేస్తే కెప్టెన్‌గా 11000 పరుగులు పూర్తి చేసిన ఆరో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే ఈ ఘనతను ఐదుగురు సాధించారు. అయితే టీమిండియా తరఫున మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఒక్కడే ఇదివరకు ఈ ఘనత సాధించాడు. మూడో టీ20 మ్యాచ్‌లో కోహ్లీ తన ఖాతాను ఓపెన్ చేస్తే చాలు అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా నిలుస్తాడు. కోహ్లీ ఇప్పటివరకు కెప్టెన్‌గా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 10,999 పరుగులు చేశాడు.

అత్యంత వేగంగా 1000 పరుగులు
రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు అందుకున్న కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంక పేసర్ లిసత్ మలింగ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీ 25 పరుగులు దూరంలో ఉన్నాడు. రెండో టీ20లో 30 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ధోనీ 62 మ్యాచ్‌ల్లో 1112 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

రోహిత్ రికార్డు బ్రేక్
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన అటగాడిగా తన సహచర ఆటగాడు రోహిత్ శర్మను కూడా కోహ్లీ అధిగమించాడు. రెండో టీ20లో కోహ్లీ ఒక పరుగు చేసిన వెంటనే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌కి ముందు టీ20ల్లో రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ 104 టీ20ల్లో 2,633 పరుగులు సాధించగా.. కోహ్లీ 75 మ్యాచుల్లోనే ఈ పరుగులు చేయడం విశేషం.

ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్
పుణెలో జరిగే తుది పోరులో భారత్ గెలిస్తే 2-0తో సిరీస్ సమమౌతుంది. మరోవైపు టీమిండియా ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్‌కు ప్రయోగాలు చేసే పనిలో నిమగ్నమైంది. రెండో టీ20 అనంతరం కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే టీ20 ప్రపంచకప్ సందర్భంగా కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకునే ఆలోచనను వ్యక్తం చేశాడు. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో పేస్‌తో పాటు బౌన్స్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












