తొలి క్రికెటర్‌గా రికార్డు: కోహ్లీకి పాలీ ఉమ్రిగర్ అవార్డు


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌కు ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డు ఈ ఏడాది కూడా కోహ్లీనే వరించింది. ఈ అవార్డుని అందుకోవడం కోహ్లీ ఇది వరుసగా నాలుగోసారి. తద్వారా ఈ అవార్డును నాలుగుసార్లు గెలిచిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఈ మేరకు బీసీసీఐ గురువారం అధికారికంగా ప్రకటించింది. విరాట్ కోహ్లీతోపాటు మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కూడా అత్యుత్తమ క్రికెటర్లుగా ఎంపికయ్యారు. జూన్ 12న బెంగళూరు వేదికగా జరగనున్న బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులని అందజేయనున్నట్లు బోర్డు వెల్లడించింది.

2006లో తొలిసారి ఈ అవార్డుని ప్రవేశపెట్టారు
2006లో తొలిసారి ఈ అవార్డును ప్రవేశపెట్టగా ఆ ఏడాది క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ అవార్డుని అందుకున్నాడు. 2007లో వీరేంద్ర సెహ్వాగ్, 2008లో గౌతమ్ గంభీర్, 2009లో సచిన్ టెండూల్కర్, 2010లో రాహుల్ ద్రవిడ్, 2011లో విరాట్ కోహ్లి, 2012లో రవిచంద్రన్ అశ్విన్, 2013లో భువనేశ్వర్‌కుమార్‌లు ఈ అవార్డుని అందుకున్నారు.

పాలి ఉమ్రిగర్ అవార్డుకు నాలుగోసారి ఎంపికైన కోహ్లీ
ఆ తర్వాత 2014, 2015లతోపాటు 2016, 2017 ఏడాదిలకు కలిపి మొత్తంగా నాలుగోసారి విరాట్ కోహ్లీ పాలి ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇక, మహిళల జట్టు విషయానికి వస్తే తొలిసారి ఈ అవార్డును ఇవ్వబోతున్నారు. గతేడాది మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టుని ఫైనల్‌కి చేర్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ 2016-17కి గాను ఈ అవార్డుకి ఎంపికైంది.
2017-18 ఏడాదికిగానూ ఓపెనర్ స్మృతి మంధానకు
గతేడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ స్మృతి మంధాన 2017-18 ఏడాదికిగానూ అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపికైంది. ‘బీసీసీఐ అవార్డులని గెలుచుకున్న క్రీడాకారులకి నా అభినందనలు. గత రెండేళ్లుగా భారత పురుషులు, మహిళల జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. వారి విజయాల్ని చూసి మేము గర్వపడుతున్నాం' అని బీసీసీఐ పరిపాలక కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.
దాల్మియా జ్ఞాపకార్థం నాలుగు అవార్డులు
ఇక బీసీసీఐ పాలనలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన దివంగత జగ్మోహన్ దాల్మియా జ్ఞాపకార్థం నాలుగు అవార్డులను బీసీసీఐ ప్రకటించింది. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీని అండర్ 16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన వాళ్లతోపాటు మహిళల క్రికెట్‌లో బెస్ట్ జూనియర్, సీనియర్ ప్లేయర్స్‌కు అందిస్తారు. ఇక 9 కేటగిరీల్లో ప్రైజ్‌మనీని గతంలో ఉన్న లక్ష నుంచి లక్షన్నరకు బీసీసీఐ పెంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications