30వ పడిలోకి కోహ్లీ: 'ఇతన్ని పుట్టించినందుకు ధన్యవాదాలు దేవుడా..'

హైదరాబాద్: 2018 నవంబరు 5 నాటికి 30వ పడిలోకి అడుగుపెడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ హరిద్వార్ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. వాటిలో ప్రత్యేకంగా తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ చెప్పిన శుభాకాంక్షలు హైలెట్‌గా నిలిచాయి. విరాట్‌కు విషెస్ తెలుపుతూ అతనితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.
పుట్టించినందుకు ధన్యవాదాలు
‘ఇతన్ని పుట్టించినందుకు ధన్యవాదాలు దేవుడా' అని అనుష్క ట్వీట్ చేశారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ అనంతరం విరామం తీసుకుంటున్నాడు కోహ్లీ. ఈ నేపథ్యంలో పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి విరాట్, అనుష్క కలిసి బయటికెళ్లారు. గతంలో అనుష్క బర్త్‌డేను పురస్కరించుకుని విరాట్ రకరకాల కేక్స్ తెప్పించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు.
భర్త కోసం సర్‌ప్రైజ్ పార్టీని ఏర్పాటుచేసినట్లు
ఇప్పుడు అనుష్క కూడా తన భర్త కోసం సర్‌ప్రైజ్ పార్టీని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఇక వర్క్ విషయానికొస్తే..ఇటీవలే కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేసి, అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

ప్రచార కార్యక్రమాలతో బిజీగా
మరోపక్క అనుష్క ‘జీరో' సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో అనుష్క షారుక్‌కు జోడీగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను షారూక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది సినిమా యూనిట్. ట్రైలర్‌కు విశేష ఆదరణ లభించింది. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది
కెప్టెన్‌కు జన్మదిన శుభాకాంక్షలు
సీనియర్ క్రికెటర్లతో పాటు.. యావత్ ప్రపంచమంతా తన అభిమాన కెప్టెన్(బ్యాట్స్‌మన్) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రత్యేక వీడియోను పోస్టు చేసింది. అందులో కెప్టెన్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications