Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత క్రికెట్‌లో కోహ్లీ శకం: కనిపించని రోహిత్ శర్మ పేరు

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు వన్డేలు, టీ20ల సిరీస్‌‌లకు బీసీసీఐ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని ప్రకటించింది. టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. బుధవారం పరిమతి ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడంతో అందరి దృష్టి కోహ్లీ పైనే పడింది.

అందరూ ఉహించినట్టుగానే ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు కెప్టెన్‌గా కోహ్లీని పేరుని అధికారికంగా ప్రకటించారు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. ఇప్పటివరకు టెస్టులకు నాయకుడిగా వ్యవహరిస్తున్న కోహ్లీ ఇకపై మూడు ఫార్మెట్లలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

దీంతో భారత జట్టులో కోహ్లీ శకం మొదలైందంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత క్రికెట్‌లో కోహ్లీ పేరు అలా మారు మ్రోగుతుంటే కోహ్లీ అంతటి చరిష్మా ఉన్న రోహిత్ శర్మ మాత్రం జట్టులో చోటు దక్కించుకోవడానికే నానా తంటాలు పడుతున్నాడు.

శుక్రవారం వన్డే, టీ20 ఫార్మెట్‌లకు భారత జట్టుని విడివిడిగా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించాడు. ఈ రెండింటిలో కూడా రోహిత్ శర్మ కనిపించలేదు. దీంతో రోహిత్ ఏమయ్యాడనేదే వార్త ఇప్పుడు క్రికెట్ అభిమానులను బాధిస్తోంది. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లలో పలువురు భారత క్రికెటర్లు గాయాలు పాలైన సంగతి తెలిసిందే.

రోహిత్ శర్మకు కివీస్‌పై మ్యాచ్ ఆడుతున్న సమయంలో తొడ భాగంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తాను కోలుకోవడానికి రెండు నెలలకు పైగా సమయం పట్టే అవకాశముందని బీసీసీఐ ప్రకటించింది.

Virat Kohli Set to be Named Limited-Overs Captain to Usher in New Era

దీంతో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. అయితే రోహిత్ శర్మ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే జట్టుతో పాటు, టీ20 జట్టులో కూడా ఎంపిక చేయకుండా అతనికి సెలక్టర్లు పూర్తి విశ్రాంతినిచ్చారు.

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టు:
వన్డే జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), మహేంద్ర సింగ్ ధోని (వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానె, హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అమిత్‌ మిశ్రా, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌.

ఇంగ్లాండ్‌తో మూడు టీ20లకు భారత జట్టు:
టీ20 జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), మన్‌దీప్‌ సింగ్, కేఎల్‌ రాహుల్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రిషబ్‌పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌, మనీశ్‌ పాండే, బుమ్రా, భువనేశ్వర్‌, ఆశిష్‌ నెహ్రా

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+