For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త శకం మొదలుకాబోతుంది: వన్డే కెప్టెన్‌గా కోహ్లీ?

బీసీసీఐ ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో శుక్రవారం జరిగే సమావేశంలో భారత వన్డే, టీ20 కెప్టెన్‌గా కోహ్లీని లాంఛనంగా ఎంపిక చేయనున్నారు. 

By Nageshwara Rao

హైదరాబాద్: భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొత్త శకం మొదలుకాబోతుంది. బీసీసీఐ ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో శుక్రవారం జరిగే సమావేశంలో భారత వన్డే, టీ20 కెప్టెన్‌గా కోహ్లీని లాంఛనంగా ఎంపిక చేయనున్నారు. ఈ భేటీకి హాజరుకావాలని కోహ్లీకి బీసీసీఐ ఆహ్వానం కూడా పంపింది.

కోహ్లీ వస్తే ముందుగా అతణ్ణి కెప్టెన్‌గా ప్రకటించి తర్వాత అతని సమక్షంలోనే జట్టును ఎంపిక చేయనున్నారు. వన్డే, టి20 కెప్టెన్‌ ధోనీ బుధవారం రాత్రి అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ వారసుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడానికి కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పాడు. అయితే సమతూకంతో వన్డే, టీ20 జట్లను ఎంపిక చేయడమే సెలక్టర్లకు పెద్ద సవాల్‌గా మారింది. రోహిత్‌ శర్మ, రహానె గాయాలతో ఇప్పటికే దూరమయ్యారు.

Virat Kohli set to be named limited-overs captain

అయితే సుదీర్ఘ టెస్టు సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని స్పిన్‌ ద్వయం అశ్విన్‌, జడేజాకు విశ్రాంతినివ్వనున్నారు. వన్డే, టీ20 జట్లతో పాటు ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల కోసం భారత ఏ జట్టును కూడా సెలెక్టర్లు ప్రకటించనున్నారు.

దీంతో ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరిస్‌కు శిఖర్‌ ధావన్‌కు అవకాశం లభించవచ్చు. ఢిల్లీ తరఫున అతను రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నాడు. మనీష్‌ పాండేతో రహానె స్థానాన్ని భర్తీ చేసే చాన్స్‌ కనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో ఒక్క పరుగుతో డబుల్‌ సెంచరీ కోల్పోయిన కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి రానున్నాడు.

ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగాన్ని భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేష్‌ యాదవ్‌, జస్‌ప్రీత్ బుమ్రాతో భర్తీ చేయనున్నారు. అశ్విన్‌, జడేజా గైర్హాజరీలో షాబాజ్‌ నదీమ్‌కు పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ అనంతరం గాయం కారణంగా అతడు రంజీ ట్రోఫీలో ఆడలేదు.

ఇక మరో ఆఫ్‌స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌ గాయం వల్ల ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టులో ఆడలేదు. ఇదిలా ఉంటే గతేడాదిగా టీమిండియాకు దూరమైన సురేష్‌ రైనా పునరాగమనం ఆసక్తి నెలకొంది. అతని భవితవ్యం కూడా శుక్రవారం తేలనుంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్కు ఎంపికైనా అనారోగ్యం కారణంగా బరిలోకి దిగలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+