నేను నేర్చుకున్నది ఒక్కటే: అప్ఘన్ జట్టుకి కోహ్లీ వీడియో సందేశం
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా రాణించాలనే దానిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్లకు ఓ వీడియో సందేశం ఇచ్చాడు. షపగీజా టీ20 లీగ్‌లో భాగంగా స్టేడియం వద్ద ఆత్మాహుతి బాంబు దాడిన జరిగినా టోర్నీని విజయవంతం చేసిన తీరుపై అభినందనలు తెలిపాడు.
రాబోయే రోజుల్లో ఆప్ఘనిస్థాన్ జట్టు ఆడే టోర్నీలో రాణించాలని ఈ సందర్భంగా కోహ్లీ ఆకాంక్షించాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ వీడియో సందేశాన్ని ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అందులో కోహ్లీ ఇలా...
మీరు ఆడిన మ్యాచ్‌లను చూశా
'మీ టీ20 టోర్నీని విజయవంతం చేసినందుకు అభినందనలు. క్రికెట్‌లో ఇప్పటి దాకా మీ ప్రయాణం, ఇక ముందు జరగబోయే ప్రయాణానికి ఆల్‌ది బెస్ట్. ఇప్పటివరకు మీరు ఆడిన మ్యాచ్‌లను చూశా. ఇకపై కూడా మీరేం చేస్తున్నారో చూస్తూనే ఉంటా' అని కోహ్లీ అన్నాడు.

అప్ఘన్‌కు నేను రాలేదు
'ఇప్పటి వరకు అప్ఘన్‌కు నేను రాలేదు. అయితే క్రికెట్ పట్ల మీరు చూపిస్తున్న దార్శనికత, అభిరుచిని ప్రత్యేకించి మీ క్రికెటర్లలోచూస్తున్నా. నా ఈ చిన్న ప్రయాణంలో నేను నేర్చుకున్నది ఒక్కటే. ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేస్తే జీవితంలో కచ్చితంగా విజయవంతం అవుతాం' అని పేర్కొన్నాడు.

లక్ష్యానికి కట్టుబడితే విజయం మీదే
'అయితే, ఈ క్రమంలో అడ్డంకులు కూడా వస్తాయి. మీరు మీ లక్ష్యానికి కట్టుబడితే విజయం సాధించొచ్చు. మీరే సొంతంగా ఆలోచించండి. సొంతగా వ్యూహాలు రచించండి. మీ అంతట మీరే గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మరొకరిని అనుకరించొద్దు. మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ కోహ్లీ ముగించాడు.
హాంకాంగ్‌కు చేరుకున్న ఆప్ఘనిస్థాన్ జట్టు
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆప్ఘనిస్ధాన్ జట్టు నాలుగు రోజుల ఇంటర్ కాంటినెంటల్ కప్ మ్యాచ్ కోసం హాంకాంగ్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అభిమానులతో పంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications