ముంబై: ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనను కనబర్చిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత కాస్తంత రిలాక్స్‌గా కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ మంగళవారం తన ఫేస్‌బుక్ పేజీలో ఓ ఫోటోను పోస్టు చేశాడు.
ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముద్దుల కూతురు జివాతో కలిసి తసుకున్న సెల్ఫీ అది. ఈ సెల్ఫీలో జివా చూడ ముచ్చటగా మాట్లాడుతుంటే, చిన్నారిని డిస్టర్బ్ చేయొద్దన్న ఎక్స్‌ప్రెషన్‌ను విరాట్ కోహ్లీ ఇచ్చాడు.

ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో టీమిండియాను సెమీస్‌కు చేర్చిన కోహ్లీ... రెండు రోజుల విశ్రాంతి నేపథ్యంలో జివాతో సెల్ఫీ దిగాడు. ఈ ఫోటోకు ధోనీ డాటర్ క్యూట్‌గా ఉందంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ర్టేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను వెనక్కి నెట్టి కోహ్లీ నెంబర్ వన్ ర్యాంక్‌కు ఎగబాకాడు.
వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఫించ్ కంటే విరాట్ 24 పాయింట్ల వెనకంజలో ఉన్నాడు. అయితే అతను చివరి నాలుగు మ్యాచల్లో 92 సగటు, 132 స్ట్రయి క్ రేట్‌తో 184 పరుగులు సాధించాడు. దీంతో విరాట్ ఖాతాలో ఏకంగా 68 పాయింట్లు చేరడంతో టాప్ ర్యాంక్‌కు చేరాడు. చివరిసారి 2014లో కోహ్లీ నెంబర్ వన ర్యాంక్‌లో నిలిచాడు.
కాగా, మరే ఇతర భారత బ్యాట్స్‌మెనకు టాప్-10లో చోటు దక్కలేదు. ఇక ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత అగ్రస్థానం పదిలం చేసుకుంది. వరల్డ్‌క్‌పలో మూడు మ్యాచలు నెగ్గిన ధోనీసేన 2 పాయింట్లు సాధించి టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది.
With Baby DhoniShe is too cute and adorable!
Posted by Virat Kohli onTuesday, March 29, 2016