
హైదరాబాద్: జట్టు ఎంపిక తలనొప్పిగా మారిన కోహ్లీ ఎట్టకేలకు తుదిజట్టుతో బరిలోకి దిగాడు. ఇంగ్లాండ్-ఇండియా తొలి టెస్టు ప్రారంభమవగానే జట్టులో పూజారాకు చోటు దక్కకపోవడంతో.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై నెటిజన్లు విమర్శలకు దిగుతున్నారు. మ్యాచ్ ఆరంభమైన గంటసేపులోనే కోహ్లీపై దాడికి దిగారు. పూజారాను తప్పించడం అతని స్థానంలో కేఎల్ రాహుల్, ధావన్ ఎందుకు ఉంచారంటూ కామెంట్లు పెడుతున్నారు.
టెస్టు జట్టును వన్డే, టీ20లకు భిన్నంగా ఎంపిక చేసిన కోహ్లీ వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇచ్చాడు. ఐతే పుజారాకు తుది జట్టులో చోటు కల్పించకపోవడంతో అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇలా కామెంట్లు చేస్తున్నారు.
మరోసారి సరైన జట్టును ఎంపిక చేయలేదు. పుజారాను కాదని ధావన్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. కౌంటీల్లో పుజారా సరిగా రాణించలేదనే తప్పించారు. పుజారాకు ఇంగ్లిష్ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. దీని కూడా కోహ్లీ పరిగణనలోకి తీసుకోకుండా సన్నాహక మ్యాచ్‌లో వరుసగా రెండుసార్లు డకౌటైన ధావన్‌ను ఎంచుకున్నాడు.
పూజారా కౌంటీ క్రికెట్‌లో సరిగా రాణించలేకపోయాడు. అతణ్ని తప్పించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ధావన్ పరిస్థితి కూడా అలానే ఉంది. మరి అతడిని జట్టులోకి ఎలా తీసుకున్నారు?
పుజారా భారత్ తరఫున అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి పరిగణనలోకి తీసుకుంటే.. అతను జట్టులో ఉన్నప్పుడే విజయాలు ఎక్కువ నమోదు చేశాం. అతను జట్టులో ఉన్నప్పుడు, లేనప్పుడు గెలుపోటములను చూస్తే..
* జట్టులో ఉన్నప్పుడు.. 58 టెస్టుల్లో 33 విజయాలు. 12 ఓటములు. 13 డ్రాలు.
* జట్టులో లేనప్పుడు.. 23 టెస్టు్ల్లో కేవలం 6 మాత్రమే విజయాలు. 10 ఓటములు, 7 డ్రాలు.
పూజారా జట్టులో ఆడకపోవడం: టెర్రర్ అలర్ట్
ఇషాంత్ శర్మ జట్టులో ఆడడం: బిగ్ టెర్రర్ అలర్ట్