ధోని ప్యూచర్‌పై కోహ్లీ, సెలక్టర్లే నిర్ణయం తీసుకోవాలి

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవితవ్యంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్లు సైతం రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతడికే వదిలేయాని అంటున్నారు. అయితే, మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ మాత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెలక్టర్లు ధోని భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.

కోహ్లీ, సెలక్టర్ల ఆలోచన ఎలా ఉందో
"ధోని కెరీర్‌పై విరాట్ కోహ్లీ, సెలక్టర్ల ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు. వారిద్దరే ముఖ్యమైన వ్యక్తులు. వారే నిర్ణయం తీసుకోవాలి" అని గంగూలీ చెప్పుకొచ్చాడు. భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటనతో టీమిండియా హోం సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది.

మొహాలీ వేదికగా రెండో టీ20
రెండో టీ20 బుధవారం మొహాలీ వేదికగా జరగనుంది. మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియానే హాట్ ఫేవరేట్ అని సౌరవ్ గంగూలీ అన్నాడు. "టీమిండియానే ఫేవరేట్. స్వదేశంలో టీమిండియా చాలా డేంజరస్ జట్టు. గత కొన్ని సంవత్సరాలుగా సొంతగడ్డపై టీమిండియాను బీట్ చేయడం కష్టమనే సంగతి మనకు తెలిసిందే" అని గంగూలీ పేర్కొన్నాడు.

టీమిండియా కోచ్‌గా చేసే ఆలోచన ఉందా
ఇక టీమిండియా కోచ్‌గా చేసే ఆలోచన ఉందా.. అది ఎప్పుడు చెపట్టే అవకాశం ఉందనుకోవచ్చు అనే ప్రశ్నకు సమాధానంగా "ముందు ప్రస్తుతం ఉన్న కోచ్ పదవి ముగియనివ్వండి.. ఆ తర్వాత నా సంగతి చూద్దాం. ప్రస్తుతం కోచ్‌గానే విధులు నిర్వహిస్తున్నాను. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చూస్తున్నాను. గత ఏడు సీజన్లుగా ఆ జట్టు ప్రదర్శన చూస్తే గత సీజన్‌లో మాత్రం ఆ జట్టు సెమీఫైనల్స్ వరకు వెళ్లింది" అని గంగూలీ అన్నాడు.

గంగూలీ తెలివిగా సమాధానం
ఇక, ప్రస్తుత ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లు ఎవరు అనే దానిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలివిగా సమాధానం చెప్పాడు. "కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. అదెలా చెప్పగలం. ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో విరాట్ కోహ్లీ ది బెస్ట్. అది మనకు ఆనందం కలిగించే అంశం. ఇక స్టీవ్ స్మిత్ ఎంత గొప్పవాడో అతని రికార్డులే చెబుతున్నాయి" అని గంగూలీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications