Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జింబాబ్వే మ్యాచ్‌లో రేర్ సీన్.. రెండో పరుగు తీసి ఛాతీ నొక్కుకున్న కోహ్లీ!

Virat Kohli seen holding chest after running double video goes viral

కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచ క్రీడాకారుల్లో అత్యంత ఫిట్‌గా ఉండే వాళ్ల పేర్లు రాస్తే.. ఆ జాబితాలో కచ్చితంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు ఉంటుంది. ఫిట్‌నెస్‌కు పెద్ద పీట వేసే కోహ్లీ.. జిమ్‌లో చాలా కష్టపడతాడు. దానికి తగ్గ ఫలితం మైదానంలో కనిపిస్తుంది. కోహ్లీ క్రీజులో ఉంటే ఫీల్డర్లు మరింత కష్టపడాలి. ఎందుకంటే అసాధ్యం అనుకున్న చోట కూడా సింగిల్ తీసి స్ట్రైక్ రొటేట్ చేసే సత్తా కోహ్లీ సొంతం.

బెస్ట్ రన్నర్..

క్రికెట్‌ అంటే కేవలం ఫోర్లు, సిక్సర్లే కాదు కదా. క్లిష్ట సమయాల్లో తీసే సింగిల్స్, డబుల్స్ కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాయి. ఈ విషయం కోహ్లీకి బాగా తెలుసు. అందుకే ఎలాంటి బంతికైనా రన్స్ చేస్తాడతను. సాధారణ ఆటగాళ్లు సింగిల్ తీసే చోట కోహ్లీ డబుల్ తీస్తాడు. డబుల్ తీసే చోట తను మూడు పరుగులు చేస్తాడు. అతని ఈ పరుగు నిపుణులను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

కోహ్లీ కూడా మనిషే కదా..

అసలు కోహ్లీ ఎంత వేగంతో రన్స్ చేస్తాడు అని చూసి నోరెళ్లబెట్టారు. వికెట్ల మధ్య పరిగెత్తే సమయంలో కోహ్లీ వేగం పీక్స్‌లో గంటకు 30 కిలోమీటర్లపైగా ఉంటుంది మరి. అయితే తాజాగా జింబాబ్వే మ్యాచ్‌లో ఒక అరుదైన ఘటన ప్రేక్షకులకు షాకిచ్చింది. అదేంటంటే.. వేగంగా రెండు పరుగులు తీసిన విరాట్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఒక్క క్షణం కిందకు వంగి నిలబడి రెండు మూడు సార్లు బలంగా శ్వాస తీసుకున్నాడు. ఆ తర్వాత గుండెల వద్ద నొప్పి వచ్చినట్లు అరచేత్తో నొక్కుకున్నాడు. అది చూసిన ప్రేక్షుకులు భయపడిపోయారు.

కొట్టిపారేసిన గవాస్కర్..

కొట్టిపారేసిన గవాస్కర్..

కోహ్లీ అలా ఇబ్బంది పడటం చూసి షాకైన కామెంటేటర్లు కూడా అతని ఫిట్‌నెస్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా కామెంటరీ చెప్తున్న సునీల్ గవాస్కర్.. కోహ్లీ పిట్‌నెస్‌పై ప్రశ్నలే అక్కర్లేదన్నాడు. 'వికెట్ల మధ్య విరాట్ చాలా వేగంగా పరిగెడతాడు. అక్కడ దొరికే ఎక్స్‌ట్రా పరుగు కోసం ప్రయత్నిస్తాడు. తను బంతిని కొట్టిన క్షణంలోనే ఫీల్డర్ ఎక్కడున్నాడు? తను ఎంత బలంగా ఆ షాట్ కొట్టాడు? అనే విషయాలు కోహ్లీకి అర్థమైపోతాయి. అందుకే ప్రతిసారీ రెండో పరుగు తీస్తాడు. అక్కడ కొంచెం ఊపిరి తీసుకున్నాడంతే' అని తేల్చిచెప్పాడు.

Story first published: Monday, November 7, 2022, 11:48 [IST]
Other articles published on Nov 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+