స్టీవ్ స్మిత్ రికార్డు సమం: పూణె టెస్టులో విరాట్ కోహ్లీ 26వ సెంచరీ

హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ చెలరేగుతున్నారు. ఓవర్ నైట్ స్కోరు 273/3 రెండో రోజు ఆటను కొనసాగించిన భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చేలరేగగా... వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ముందు రహానే 145 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... 173 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో విరాట్ కోహ్లీ 101 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 26వ సెంచరీ కావడం విశేషం. దీంతో 112 ఓవర్లకు 352/3తో పటిష్ట స్థితిలో టీమిండియా ఉంది.
టెస్టుల్లో కోహ్లీ 26వ సెంచరీ
ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(103), రహానే(55) పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు నాలుగో వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బ్యాట్స్‌మెన్ ఇలాగే కొనసాగితే టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. తన 26వ సెంచరీతో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను సాధించాడు.

స్మిత్ రికార్డు సమం
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్టు సెంచరీల రికార్డుని సమం చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా 40 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్(41-376 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.

రెండో స్థానంలో విరాట్ కోహ్లీ
ఆ తర్వాత విరాట్ కోహ్లీ(40- 185 ఇన్నింగ్స్‌లు), గ్రేమ్ స్మిత్(33- 368ఇన్నింగ్స్‌లు), స్టీవ్ స్మిత్(20- 118 ఇన్నింగ్స్‌లు), మైకేల్ క్లార్క్(19- 171 ఇన్నింగ్స్‌లు), బ్రియాన్ లారా(19- 204 ఇన్నింగ్స్‌లు) ఈ జాబితాలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications