50వ టెస్టులో 14వ సెంచరీ సాధించిన కెప్టెన్ కోహ్లీ
విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన క్రికెట్ కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ అభిమానులకు గుర్తుండిపోయేలా 14వ టెస్టు సెంచరీని సాధించాడు.
154 బంతుల్లో 12 ఫోర్లతో 101 పరుగులు పూర్తి చేశాడు. దీంతో తన టెస్టు కెరీర్‌లో 14వ శతకాన్ని నమోదు చేశాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(0), 22 పరుగుల వద్ద మురళీ విజయ్(20) ఔట్ కావడంతో కష్టాల్లో పడింది.

పుజారా-కోహ్లీ అద్భుమైన భాగస్వామ్యం
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లీ, పుజారాతో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి అజేయంగా 226 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్‌పై మూడో వికెట్‌కు 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 14 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి.

సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలు
2002లో సచిన్ టెండూల్కర్ - రాహుల్ ద్రవిడ్‌ల జోడి హెడింగ్లీలో జరిగిన టెస్టులో 150 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని ఇంగ్లాండ్‌పై చివరిసారి సాధించింది. రెండో టెస్టులో కోహ్లీతో పాటు పుజార్ కూడా సెంచరీ సాధించాడు. తొలుత పూజారా 184 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ చేయగా, ఆ తర్వాత కాసేపటికి కోహ్లి సెంచరీ పూర్తి చేశాడు.

టెస్టుల్లో కోహ్లీకి ఇది 14వ సెంచరీ
టెస్టుల్లో కోహ్లీకి ఇది 14వ సెంచరీ కాగా, పుజారాకు 10వ సెంచరీ కావడం విశేషం. వీరిద్దరి జోడి నిలకడాగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పులు పెట్టారు. కాగా, జట్టు స్కోరు 248 పరుగుల వద్ద పుజారా (119) అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

49 టెస్టుల్లో 84 ఇన్నింగ్సులు ఆడాడు
కోహ్లీ టెస్టు కెరీర్ ప్రత్యేకతలివే
* 49 టెస్టుల్లో 84 ఇన్నింగ్సులు ఆడాడు
* అత్యధిక వ్యక్తిగత పరుగులు 211
* మొత్తం పరుగులు 3,643
* టెస్టుల్లో యావరేజి 46.11. ఇక స్ట్రయిక్ రేట్ 53.69
* కెప్టెన్‌గా యావరేజి 55.17
* సెంచరీలు 14, డబుల్ సెంచరీలు 2, అర్ధ సెంచరీలు 12
* 50 పరుగులకుపైగా చేసినప్పుడు గెలిచిన మ్యాచ్‌లు 9
* టెస్టు కెప్టెన్‌గా వరుసగా నాలుగు సిరీస్‌లు కైవసం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications