Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ పరుగుల యంత్రాన్ని ఎవరు ఆపలేరా.. బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న కింగ్ కోహ్లీ..

Virat Kohli scored a half century in the match against Netherlands

విరాట్ కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్లతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవు కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 9 పరుగులకే ఓపెనర్ కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లారు. 39 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేసిన రోహిత్ క్యాచ్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్ తో రోహిత్ మరో ఘనత సాధించాడు. వరల్డ్ కప్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 34 సిక్స్ లతో ప్రథమ స్థానంలో ఉండగా.. యువరాజ్ సింగ్ 33 సిక్స్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లీ 24 సిక్స్ లతో మూడో స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ చేయడమే కాకుండా టీ20 వరల్డ్ కప్ ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ గేల్ (965) అధికమించిన కోహ్లీ (979) పగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన 82 పరుగులతో అజేయంగా నిలిచి ఇండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. అయినా కోహ్లీ ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Story first published: Thursday, October 27, 2022, 14:34 [IST]
Other articles published on Oct 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+