Virat Kohli: ఈ ఓటమి మా మంచికే.. వరుణ్ చక్రవర్తీ రాణించడం శుభపరిణామం!

IPL 2021 : Varun Chakravarthy Is Going To Be A Key Factor For India - Virat Kohli || Oneindia Telugu

దుబాయ్: కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఎదురైన పరాజయం తమ మంచికే జరిగిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ ఓటమి ఆరంభంలోనే తమ బలహీనతలు ఏంటో తెలుసుకునేలా చేసిందన్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై కేకేఆర్ 9 వికెట్లతో గెలుపొంది ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కోహ్లీ.. చెత్త బ్యాటింగ్‌తోనే పరాజయం పాలయ్యామని చెప్పాడు. అయితే ఈ ఓటమి టోర్నీల్లో రాణించేందుకు తమకు ఓ గుణపాఠంగా ఉంటుందని చెప్పాడు. ఇక టీ20 ప్రపంచకప్ ముందు వరుణ్ చక్రవర్తీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభపరిణామమని చెప్పుకొచ్చాడు. ఈ మిస్టరీ స్పిన్నర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు

 వరుసగా వికెట్లు కోల్పోవడంతో..

వరుసగా వికెట్లు కోల్పోవడంతో..

‘భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా కీలకం. అదే మేం చేయలేకపోయాం. ఇక ఆరంభంలోనే ఇంత డ్యూ ఉంటుందని అస్సలు ఊహించలేకపోయాం. 42/1తో మెరుగైన దశలో ఉన్న మేం 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయాం. ఈ పరాజయం మాకు ఓ వేకప్ కాల్. ఆరంభంలోనే ఎదురైన ఈ ఓటమితో మా బలహీనతలేంటో తెలిసాయి. వాటిని సరిచేసుకొని టోర్నీలో ముందడగు వేయాల్సిన అవసరం ఉంది. మేం చెత్తగా ఆడామనే విమర్శలు రావచ్చు. కానీ ప్రొఫెషనల్స్‌గా మేం సర్దుకు పోగలం.

 వరుణ్ ఫామ్‌లోకి రావడం..

వరుణ్ ఫామ్‌లోకి రావడం..

టోర్నీలో ముందుకు సాగాలంటే 8 మ్యాచ్‌లు గెలవాల్సిందే. ఇప్పటికే 8 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచాం. మరో ఆరు మ్యాచ్‌ల్లో కచ్చితంగా మూడు గెలవాలి. మా బలాలకు తగిన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. తదుపరి మ్యాచ్‌ల్లో పుంజుకోగలం, మా జట్టుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక వరుణ్ చక్రవర్తీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభపరిణామం. భారత్ తరఫున ఆడేటప్పుడు అతను కీలకం కానున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం వచ్చిన ఆటగాళ్లంతా ఇలానే రాణిస్తే భారత బెంచ్ బలంగా ఉంటుంది. సమీప భవిష్యత్తులో టీమిండియా తరఫున బరిలోకి దిగనున్న వరుణ్ చక్రవర్తీ ఇలా రాణించడాన్ని డగౌట్ నుంచి ఆస్వాదించా.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

వరుణ్ తీన్మార్..

వరుణ్ తీన్మార్..

ఈ మ్యాచ్‌లో మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(3/13) దుమ్మురేపాడు. తనదైన మిస్టరీ బౌలింగ్‌తో ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ పనిపట్టాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్(10)ను క్లీన్ బౌల్డ్ చేసిన వరుణ్.. సచిన్ బేబీ(7) క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక అనూహ్యంగా వచ్చిన అవకాశంతో కెరీర్‌లో ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌ ఆడుతున్న వానిందు హసరంగాను వికెట్ల ముందు బోల్తా కొట్టించి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. వరుణ్ చక్రవర్తీ మిస్టరీ స్పిన్‌కు ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ విలవిలలాడారు. ఇక ఇదే యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన వరుణ్ చక్రవర్తీ.. ఇలా అద్భుత ప్రదర్శన కనబర్చడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RCB vs KKR: ఓవైపు మ్యాచ్.. మరోవైపు మసాజ్ పాపతో కైల్ జెమీసన్ రొమాన్స్!

చెత్త బ్యాటింగ్‌తో..

చెత్త బ్యాటింగ్‌తో..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19 ఓవర్లలో 92 రన్స్‌కు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(3/13), ఆండ్రీ రస్సెల్(3/9) బెంగళూరు పతనాన్ని శాసించగా.. ఫెర్గూసన్ రెండు, ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ తీశారు. అనంతరం కోల్‌‌కతా 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 రన్స్ చేసి ఘన విజయాన్నందుకుంది. చిన్న టార్గెట్‌ను ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 48), అరంగేట్ర ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 41 నాటౌట్) నింపాదిగా ఛేదించారు. ఆర్‌సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌కు ఓ వికెట్ దక్కింది.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 21, 2021, 10:00 [IST]
Other articles published on Sep 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X