For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓ దశలో మ్యాచ్‌ చేజారిందనుకున్నా.. ఓడిపోతామని కోచ్‌కు చెప్పా: కోహ్లీ

IND VS NZ 2020 : Virat Kohli Responded After Super Over Victory Against New Zealand
Virat Kohli says The way Kane Williamson played, NZ probably deserved to win

హామిల్టన్‌: మ్యాచ్ సాగుతుండగా ఓ దశలో మ్యాచ్‌ చేజారిందని అనుకున్నా. కేన్‌ విలియమ్సన్‌ ఆడిన తీరు చూసి న్యూజిలాండ్‌ గెలుస్తుందని కోచ్‌తో చెప్పా అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. మూడో టీ20లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ, పేసర్‌ మహ్మద్ షమీపై కోహ్లీ ప్రశంసలు కురిపించారు. మూడో టీ20 ఆఖరి ఓవర్లో షమీ మ్యాజిక్‌, సూపర్‌ ఓవర్లో రోహిత్‌ డబుల్‌ సిక్సర్‌లతో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కివీస్‌ గడ్డపై భారత్‌ తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఓడిపోతామని కోచ్‌కు చెప్పా:

ఓడిపోతామని కోచ్‌కు చెప్పా:

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఓదశలో మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం. విలియమ్సన్ (95) బ్యాటింగ్ అద్భుతం. అతడు ఆడుతుంటే.. ఈ మ్యాచ్ ఓడిపోతామని కోచ్‌తో చెప్పా. కాకపోతే అతనికి నిరాశే ఎదురైంది. కొన్ని బంతుల్ని ఆఫ్‌సైడ్‌ వేసి షమీ మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించాడు. ఆఖరి బంతి వేసే ముందు చాలా చర్చించాం. చివరి బంతికి ఎలా బౌలింగ్‌ చేసినా సింగిల్‌ తీస్తారని తెలుసు. అందుకే నేరుగా వికెట్లకు విసరమని చెప్పా. షమీ అదే చేశాడు. టేలర్‌ ఔటయ్యాడు. మ్యాచ్‌ మలుపు తిరిగింది. షమీ వేసిన చివరి నాలుగు బంతులు అత్యద్భుతం' అని కోహ్లీ అన్నారు.

ఈ క్రెడిట్ షమీదే:

ఈ క్రెడిట్ షమీదే:

'సూపర్‌ ఓవర్లో న్యూజిలాండ్‌ మరోసారి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. విలియమ్సన్‌ భారీ షాట్లు ఆడాడు. అయితే ఈ రోజు రోహిత్‌ మంచి టచ్‌లో ఉండడం కలిసొచ్చింది. సగం ఓవర్‌ అయ్యాక రోహిత్‌ ఒక్క షాట్‌ బాదితే చాలు బౌలర్‌ ఒత్తిడిలోకి వెళ్తాడని అనుకున్నా. ఎందుకంటే అతడు బంతిని బలంగా బాదేస్తాడు. చివరి రెండు బంతులకు అదే జరిగింది. అంత ఒత్తిడిలో కూడా రోహిత్ అలా భారీ షాట్లు ఆడడం అద్భుతం. అయితే ఈ విజయం క్రెడిట్ మాత్రం షమీదే' అని కోహ్లీ తెలిపారు.

బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం:

బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం:

'ప్రపంచంలోని అత్యుత్తమ డెత్‌ స్పెషలిస్టుల్లో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను విలియమ్సన్ బాగా ఎదుర్కొన్నాడు. మ్యాచ్, సూపర్‌ ఓవర్లో కేన్ బాగా ఆడాడు. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మేం ఈ సిరీస్‌ను 5-0తో గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్‌ ఇంకా మరికొందరు ఆడలేదు. వారికో అవకాశం ఇవ్వాలి. ఆటగాళ్లు ఎలా ఆడుతారో చూడాలనుకుంటున్నాం' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

సూపర్‌ ఓవర్లో విజయం:

సూపర్‌ ఓవర్లో విజయం:

మూడో టీ20లో టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. రోహిత్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) హాఫ్‌ సెంచరీ చేయగా.. కోహ్లీ (27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 38), కేఎల్‌ రాహుల్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27) రాణించారు. ఛేదనలో న్యూజిలాండ్‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులే చేసింది. విలియమ్సన్‌ (48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 95) చెలరేగగా.. గప్టిల్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31) వేగంగా ఆడాడు. సూపర్‌ ఓవర్లో న్యూజిలాండ్‌ 17/0 స్కోరు చేయగా.. భారత్‌ 20/0తో విజయం అందుకుంది.

Story first published: Thursday, January 30, 2020, 10:57 [IST]
Other articles published on Jan 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+