Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టు క్రికెట్‌ నన్ను వ్యక్తిగా మార్చింది.. దూకుడు తగ్గించుకోను: కోహ్లీ

Virat kohli Says Test cricket has made me a better person


న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌ ఆడడం వల్ల వ్యక్తిగా మరింత మెరుగయ్యానని అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. టెస్టు క్రికెట్‌లో సాధ్యమైనంత కాలం కొనసాగుతానన్నాడు. కరోనా వైరస్‌తో ప్రపంచం వణికిపోతున్న ఈ సమయంలో తాను అత్యంత సౌకర్యంగా ఉన్నానని, అందుకు భగవంతుడికి కృతజ్ఞుడినని కోహ్లి తెలిపాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇన్‌స్ట్రగామ్‌లో కోహ్లీకి, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కేపీ అడిగిన ప్రశ్నలకు కోహ్లి జవాబులిచ్చాడు.
Virat Kohli : 'Don't Need To Behave Differently As I'am Captain'
టెస్టు క్రికెట్‌తో వ్యక్తిగా మెరుగయ్యా:

టెస్టు క్రికెట్‌తో వ్యక్తిగా మెరుగయ్యా:

ఇష్టమైన ఫార్మాట్‌ ఏదని పీటర్సన్‌ అడిగిన ప్రశ్నకు.. 'టెస్టు క్రికెట్‌, టెస్టు క్రికెట్‌, టెస్టు క్రికెట్‌, టెస్టు క్రికెట్‌, టెస్టు క్రికెట్‌' అని కోహ్లీ వరుసగా ఐదుసార్లు చెప్పాడు. నేను ఐదుసార్లు చెప్పా. ఎందుకంటే టెస్టులకు ప్రాతినిధ్యం వహించడమే నా జీవితంలో గొప్ప విషయం. పరుగులు చేసినా చేయకపోయినా.. వేరే వాళ్ల బ్యాటింగ్‌కు చప్పట్లు కొట్టినా.. ఆ తర్వాత రూమ్‌కు వెళ్లాల్సిందే. తర్వాతి రోజుకు సిద్ధమవ్వాల్సిందే. నచ్చినా నచ్చకపోయినా ప్రతిరోజు దీన్ని అనుకరించాల్సిందే. జీవితంలాగే ఇది కూడా. పోటీపడడం తప్ప ప్రత్యామ్నాయం ఉండదు. టెస్టు క్రికెట్‌ నా వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచింది అని కోహ్లీ చెప్పాడు.

దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు:

దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు:

భారత జట్టుకు కెప్టెన్‌ను అయినంత మాత్రాన తాను దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని, ఎలా ఉన్నానో అలానే ఉంటానని విరాట్ కోహ్లీ చెప్పాడు. 'నేను కెప్టెన్‌ను అయినంత మాత్రాన నాలోని దూకుడును పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఆటను ఆస్వాదించగలగాలి. ఆ తర్వాత వ్యూహాల గురించి ఆలోచించాలి' అని అన్నాడు. ఇప్పటి వరకు 86 టెస్టులు ఆడిన కోహ్లీ.. 7,240 పరుగులు చేసాడు. ప్రస్తుతం అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.

భగవంతుడికి కృతజ్ఞుడిని:

భగవంతుడికి కృతజ్ఞుడిని:

మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచం వణికిపోతున్న ఈ సమయంలో తాను అత్యంత సౌకర్యంగా ఉన్నానని, అందుకు భగవంతుడికి కృతజ్ఞుడినని కోహ్లీ అన్నాడు. 'ప్రజలు ఉద్యోగాల కోసం ఇబ్బందిపడుతున్న ఈ సమయంలో ఇప్పుడు నేను ఉన్న స్థితికి ఆ దేవుడికి కృతజ్ఞుడిగా ఉంటా. ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని లేని దాని గురించి బాధ పడడంలో అర్థం లేదు' అని పేర్కొన్నాడు. కరోనాపై పోరాటంలో అందరూ ప్రభుత్వ నిబంధనలు అనుసరించాలని సూచించాడు.

అందుకే వేగన్‌గా మారా?

అందుకే వేగన్‌గా మారా?

2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఎదుర్కొన్న వెన్ను సమస్య గురించి కోహ్లీ వివరించాడు. 'అప్పుడు నా చిటికెన వేళ్లలో స్పర్షే తెలియలేదు. ఎసిడిటీతో ఇబ్బంది పడ్డా. ఎముకల్లో కాల్షియం వెళ్లిపోయేది. ఆ క్రమంలోనే మాంసాహారం మానేశా. ఆ తర్వాత ఫిట్‌గా తయారయ్యా. ఇప్పుడు నేను కాస్త విరామంతో 120 శాతంతో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడగలను; అని తెలిపాడు. కెరీర్‌లో 2014 ఇంగ్లండ్‌ సిరీస్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పాడు. పరుగులు చేయడమే గగనమని ఆ సిరీస్‌లో అనిపించినట్టు కోహ్లీ తెలిపాడు.

Story first published: Friday, April 3, 2020, 9:36 [IST]
Other articles published on Apr 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+