Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రసూల్‌కు ఇదొక అవకాశం: టీ20ల్లో ఓపెనింగ్‌పై కోహ్లీ

హైదరాబాద్: యుజువేంద్ర చాహల్, పర్వేజ్ రసూల్‌లు అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు ఇంగ్లాండ్‌తో జరిగే మూడు టీ20 సిరిస్ ఓ అద్భుతమైన అవకాశమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా గురువారం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

కాన్పూర్ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో మొట్టమొదటి టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ టీ20 జట్టులో పెద్దగా మార్పులు ఉండవని చెప్పాడు. ముఖ్యంగా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ స్ధానంలో చోటు దక్కించుకున్న రసూల్‌కు ఇదొక చక్కటి అవకాశమని తెలిపాడు.

వారిద్దరికీ ఈ సిరిస్ బ్రేక్ ఇవ్వాలి

వారిద్దరికీ ఈ సిరిస్ బ్రేక్ ఇవ్వాలి

దేశీయ టీ20 మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న యుజువేంద్ర చాహల్, రసూల్‌లు ఈ సిరిస్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తారని చెప్పాడు. ఇక పర్వేజ్ రసూల్ విషయానికి వస్తే ఐపీఎల్‌లో తన కెప్టెన్సీలో ఆడాడని తెలిపాడు. ఈ ఇద్దరికీ ఈ సిరిస్ మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

టీ20 సిరిస్‌లో సత్తా చాటుతారు

టీ20 సిరిస్‌లో సత్తా చాటుతారు

దేశీయ టోర్నీలలో సత్తా చాటిన విధంగానే ఈ టీ20 సిరిస్‌లో వీరిద్దరూ బౌలింగ్‌లో తప్పక రాణిస్తారని అన్నాడు. ఈ ఏడాది మార్చిలో జరిగిన వరల్డ్ టీ20 తర్వాత ఒకే మ్యాచ్ కూడా ఆడని సురేష్ రైనా ఈ సిరిస్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

సురేష్ రైనాపై కోహ్లీ

సురేష్ రైనాపై కోహ్లీ

రైనాకు ఇంకా అద్భుత అవకాశాలున్నాయని చెప్పిన కోహ్లీ జట్టులో నిలకడ లేనప్పుడే సమస్యలు వస్తాయని అవసరమైతే తాను ఓపెనర్‌గా వస్తానని అన్నాడు. జట్టు సమతూకాన్ని బట్టి అవసరమైతే తాను ఓపెనింగ్‌కు వస్తానని పేర్కొన్నాడు.

రెండు సార్లు మాత్రమే ఓపెనింగ్‌ చేశా

బ్యాటింగ్ లైన‌ప్‌లో టీమిండియాకు ఎన్నో ప్ర‌త్యామ్నాయాలున్నాయ‌ని, తాను ఇప్ప‌టికి రెండు సార్లు మాత్రమే ఓపెనింగ్‌ చేశానని చెప్పాడు. ఐపీఎల్‌లో పూర్తిగా ఓపెనింగ్‌ చేసిన అనుభవం తనకుందని పేర్కొన్నాడు. టీమిండియా టెస్టులు, వన్డేల్లో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తోంద‌ని, టీ20ల్లోనూ అదే ఆట‌తీరును క‌న‌బ‌రుస్తామ‌ని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+