Virat Kohli: వెయిట్ లిఫ్టింగ్‌తో బ్యాక్‌ పెయిన్‌‌కు చెక్ పెట్టా!

న్యూఢిల్లీ: ఎంతటి పెద్ద ఆటగాడైన ఏదో ఒక దశలో గాయాలు వేధించడం మాములే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2014లో అతను వెన్ను నొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. అయితే సుదీర్ఘకాలం వేధించిన ఈ వెన్ను నొప్పి సమస్యకు వెయిట్ లిఫ్టింగ్‌తో చెక్ పెట్టానని విరాట్ కోహ్లీ తెలిపాడు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ బసు శంకర్ సూచనల మేరకు తాను లిఫ్టింగ్‌ను ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. తన బ్యాక్ పెయిన్ ఇష్యూతో పాటు వరల్డ్ ఫిట్టెస్ట్ క్రికెటర్‌గా మారడం వెనుక బసు చాలా సాయపడ్డాడని కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ విషయాన్ని బసు రాసిన ఓ పుస్తకంలో కోహ్లీ పంచుకున్నాడు.

'2014 మధ్యలో నేను వెన్ను నొప్పితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఉపశమనం కోసం ప్రతీ రోజు ఉదయం 45 నిమిషాల పాటు రొటీన్ వర్కౌట్ చేయాల్సి వచ్చేది. అయినా రోజులో ఏదో ఓ టైమ్‌లో మళ్లీ సమస్య వచ్చేది. ఓసారి బసు సర్‌తో దీని గురించి మాట్లాడా. బరువులు ఎత్తడం ద్వారా శరీరాన్ని బలంగా మార్చవచ్చని సలహా ఇచ్చాడు. అయితే ఈ సలహాకు నేను పెద్దగా కన్విన్స్ కాలేదు. కానీ తనపై నమ్మకం పెట్టమని బసు సర్ అన్నాడు. 2015 లంక పర్యటనలో నేను బరువులు ఎత్తడం స్టార్ట్ చేశా. దీని వెనుక ఉన్న డైనమిక్స్, స్టడీని అర్థం చేసుకున్నా. మంచి ఫలితంతో పాటు చాలా అద్భుతంగా అనిపించింది. అప్పట్నించి లిఫ్టింగ్ నా వర్కౌట్స్‌లో రెగ్యులర్ అయ్యింది.'అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో వరుస విజయాలతో దుమ్మురేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌(ఆర్‌సీబీ)కి అరబ్ గడ్డపై కలిసిరాలేదు. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన మ్యాచ్‌లో తమకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థి అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అందుబాటులో ఉన్నా.. ఓపికగా ఆడలేక బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. ఫలితంగా ఐపీఎల్‌లో తన 200 మ్యాచ్‌ కోహ్లీకి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరోవైపు ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన కేకేఆర్ 9 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

Virat Kohli Opens About His Journey Of Get Rid Of Back Pain || Oneindia Telugu

సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19 ఓవర్లలో 92 రన్స్‌కు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(3/13), ఆండ్రీ రస్సెల్(3/9) బెంగళూరు పతనాన్ని శాసించగా.. ఫెర్గూసన్ రెండు, ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ తీశారు. అనంతరం కోల్‌‌కతా 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 రన్స్ చేసి ఘన విజయాన్నందుకుంది. చిన్న టార్గెట్‌ను ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 48), అరంగేట్ర ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 41 నాటౌట్) నింపాదిగా ఛేదించారు. ఆర్‌సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌కు ఓ వికెట్ దక్కింది.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 22, 2021, 14:53 [IST]
Other articles published on Sep 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X